Ad Code

Responsive Advertisement

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం - ఉపమాక

ఈ ఆలయం విశాఖపట్నం జిల్లా ఉపమాకలో ఉంది. ఇక్కడ స్వామి వారు స్వయంగా వెలిశారు. ఉపమాక అంటే ఈ స్థలంతో సమానమైనది వేరేది లేదు అని అర్ధం.

ఈ ఆలయం 6 వ శతాబ్దంలో నిర్మించారు.ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు శ్రీ వేణుగోపాల స్వామివారు. గరుడుడు కృష్ణ భగవానుడిని తన తల మీద విశ్రాంతి తీసుకోమని వేడుకున్నాడు. తన మాట నిలబెట్టుకోవడం కోసం భాగవానుడు గరుడ పరవటం మీద వెలిసాడు.

ముఖ్యమైన పండుగలు :

ధనుర్మాస ఉత్సవములు
అధ్యయనోత్సవాలు
కల్యాణ మహోత్సవం (పాల్గుణమాస శుద్ధ ఏకాదశి)
బ్రహ్మోత్సవాలు

ఆలయ వేళలు :

ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు
సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7 .30 వరకు.

ఎలా వెళ్ళాలి :

విశాఖపట్నం నుండి 71 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం
తుని నుండి 20 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం
అనకాపల్లి నుండి 48 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం

చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :

అన్నవరం ఆలయం - 41 కి.మీ దూరంలో
అనకాపల్లి నూకాంబిక ఆలయం - 46 కి.మీ దూరంలో
అప్పికొండ శ్రీ సోమేశ్వర ఆలయం - 67 కి.మీ దూరంలో.

Post a Comment

0 Comments