Ad Code

Responsive Advertisement

అధిక మాసంలో ఏమి చేయాలి ? ఏమి చేయకూడదు ?



ఏమి చేయాలి :
  • ఈ మాసంలో సంధ్యానుష్ఠానం , దేవతార్చన వంటి నిత్యకర్మలు యధావిధిగా చేయాలి.
  • ఏకాదశి, మాస శివరాత్రి వ్రతం లాంటి నైమిత్తికాలను కూడా ఆచరించాలి.
  • ఆయా మాసాలలో చేయవలసిన దానాలు, గ్రహశాంతి మొదలైన వాటికోసం చేసే దానాలను అధికమాసంలో చేయవచ్చు.
  • అతిధిపూజ, అన్నదానాలు ఈ మాసంలో చేయవచ్చు.
  • ఆలయాలలో దేవత పునః ప్రతిష్టలు అధికమాసంలో చేయవచ్చు.
  • కర్మ, మాసికం , ఆబ్దికం లాంటి శ్రాద్ధకర్మలను అధికమాసంలోను, ఆ తరువాత వచ్చే నిజమాసంలోను యధావిధిగా చేయాలి.
  • మొదటి సంవత్సరీకాలను అధికమాసంలో చేయవలసి వస్తే వాటిని అధికమాసంలో చేయాలి. మళ్ళీ నిజమాసంలో సంవత్సరీకాలు చేయాల్సిన అవసరం లేదు అని గ్రంధాలు చెబుతున్నాయి.
ఏమి చేయకూడదు ?
  • అధికమాసంలో శుభకార్యాలు చేయకూడదు. 
  • ఉపనయనం,వివాహం,ఉపకర్మ, గృహారంభం, గృహప్రవేశం, చెరువులు, బావులను త్రవించడం పుట్టు వెంట్రుకలు తీయడం, అన్నప్రాసన, నామకరణం మొదలైనవాటిని అధికమాసంలో చేయకూడదు.
  • ఆలయాలలో ప్రతిష్టలు, యజ్ఞయాగాదులు, తీర్థయాత్రలు, పుణ్యస్నానాలు మొదలైనవి చేయరాదు.
  • తిధి, నక్షత్ర, వారములతో కూడిన కామ్య కర్మలు అంటే ఐశ్వర్యం కోసం, సౌభాగ్యం కోసం, సంతానం కోసం చేసే వ్రతాలూ అధికమాసంలో చేయకూడదు.
  • రాజ్యాభిషేకం, పదవీస్వీకారం సన్యాస ఆశ్రమ స్వీకారం  అధికమాసంలో చేయకూడదు.

Post a Comment

0 Comments