Ad Code

Responsive Advertisement

శాకాంబరీ దేవి నవరాత్రి / శాకాంబరీ




శాకాంబరీ దేవి అనగా దుర్గ దేవి యొక్క మరో అవతారం. శాకాంబరీ జయంతిని జనవరి మాసం లో జరుపుకుంటారు. దీనిని శాకాంబరీ పూర్ణిమ గా వ్యవహరిస్తారు. ఈ పండుగను భారతదేశం మొత్తం జరుపుకుంటారు.హిందూ సంప్రదాయం లో దుర్గ దేవికి అధిక ప్రాధాన్యం ఇస్తారు.

దుర్గ దేవి అనేక అవతారాలలో ముఖ్యమైన అవతారం శాకాంబరీ దేవి. శాకాంబరీ దేవి పూలు, పండ్లు, మరియు పచ్చదనంకి అది దేవత గా భావిస్తారు.శాకాంబరీ ఉత్సవాలు తొమిది  రోజులు జరుపుతారు ఆఖరి రోజు ముఖ్యమైన రోజు అనగా శాకాంబరీ పూర్ణిమ.అదే రోజు పుష్య పూర్ణిమ.

పూర్వం చాల రోజులు భూమి మీద వర్షం లేకపోవడం వల్ల  భూమి మీద మానవులు, పక్షులు, జంతువులూ ఇంకా అనేక జీవులు మరణించాయి . అప్పుడు మహామునీలు దుర్గ దేవిని వేడుకున్నారు . ఆమె అపుడు శాకంబరీ అవతారంలో వర్షం కురిపించి భూమి మీద కరువుని పారద్రోలింది. అపుడు నుంచి భారతదేశం లో శాకాంబరీ జయంతిని జరుపుతారు.

కర్ణాటక, మహారాష్ట్రా, ఉత్తరప్రదేశ్,రాజస్థాన్,హిమాచల్ ప్రదేశ్  అనేక ప్రాంతాలలో ఉత్సవాలు అంబరాన్ని తాకుతాయి. చెన్నై లో ని శాకాంబరీ పురం లో ని శాకాంబరీ ఆలయం లో ఉత్సవాలు తొమ్మిది రోజులు  జరుపుతారు.


2020 : శాకాంబరీ పూర్ణిమ జనవరి 10

Post a Comment

0 Comments