Ad Code

Responsive Advertisement

ఆలయాలలో పుష్కరిణి విశిష్టత

  • ఆలయంలో లేక దాని సమీపంలో ఈశాన్యభాగంలో పుష్కరిణి ఉండటం మనం చాలా ఆలయాల్లో చూడొచ్చు.
  • కొలను.. కోనేరు.. కల్యాణి.. తటాకం.. తీర్థం.. ఇవన్నీ పుష్కరిణికి ఉన్న అనేక పేర్లు.
  • ఈ పుష్కరిణి సాధారణంగా నలుచదరంగా ఉండి.. అన్నివైపులా దిగడానికి వీలుగా మెట్లు నిర్మిస్తారు. కోనేటి మధ్యలో నాలుగు స్తంభాల మండపం నిర్మించి దానిపై శిఖరం నిర్మిస్తారు. దీన్ని తీర్థమండపం లేక నీరాళిమండపం అంటారు. 
  • తెప్పోత్సవం జరిగే సమయంలో స్వామివారు పుష్కరిణిలో విహరిస్తూ ఈ తీర్థమండపంలోకి వేంచేసి పూజాదికాలు అందుకుంటారు.
  • ఈ పుష్కరిణి తీర్థం దేవాలయంలో అర్చనాదులకు.. అభిషేకానికి.. ఇతర శుద్ధిపనులకు ఉపయోగ పడతాయి.
  • నిత్యం ఆలయాన్ని దర్శించే భక్తులు పుష్కరిణిలో స్నానం చేసి పునీతులౌతారు.
  • ఉత్సవాల్లో చివరి అంకంగా జరిగే అవభృథస్నానం అంటే చక్రస్నానం.. త్రిశూలస్నానం వంటివి సామూహికంగా భక్తుల సమక్షంలో ఈ పుష్కరిణిలోనే జరుపుతారు.
  • పుష్కరిణిలో స్నానం చేసిన భక్తుల తనువు శుద్ధమై పులకితమవుతుంది 

Post a Comment

0 Comments