Ad Code

Responsive Advertisement

వేములవాడ - స్థల పురాణం

వేములవాడ రాజన్న సన్నిధికి సంబంధించి పురాణాల్లో ఓ కథ ఉంది. వృత్రాసురిని చంపిన ఇంద్రుడు బ్రహ్మ హత్యదోషం నివారించుకోవడానికి ఎన్నో పుణ్యక్షేత్రాలకు తిరిగాడు. అయితే ఎక్కడకు వెళ్లినా కూడా దోష నివారణ జరగలేదట. చివరకు బృహస్పతి సూచనతో వేములవాడలోని రాజేరాజేశ్వర స్వామిని దర్శించుకున్నాడట. ఇక్కడకు రావడంతోనే ఇంద్రుడికి దోష నివారణ లభించిందని పెద్దలు చెబుతుంటారు.భాస్కర, హరిహర క్షేత్రంగా పిలువబడుతున్న ఆ ఆలయం గురించి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వరఖండంలో చెప్పబడింది. అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపటం వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని వదిలించుకోడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడట. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి, జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికిందట.ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించేందుకు సిద్దమయిన నరేంద్రుడు మొదటి జాములో నిద్రనుండి లేవక పోవడం తో పక్కనే ఉన్న నాంపెల్లి గుట్ట నుండి నవనాథ సిద్దులు ఈ శివలింగాన్ని ప్రతిష్టించారని ఇప్పటికి మొదటి జాములో వారు ధర్మ గుండం ద్వారా నేరుగా వచ్చి మూలవిరాట్టుకు పూజ చేసి వెళుతారని భక్తుల నమ్మకం.తానూ ప్రతిష్టించా లనుకున్న లింగాన్ని ఎవరో ప్రతిష్టించడం చూసి బాధపడుతున్న నరేంద్రుని చూసి శివుడు ప్రత్యక్షమై మరోశివలింగాన్ని ఇచ్చి బాల రాజేశ్వరస్వామి రూపం లో ప్రతిస్టింప జేశారని,ఆయనకు బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కలిగించాడని పురాణగాథ ఉంది. అందుకే శివుడు విశ్రాంతి కోసం ఎవరికీ చెప్పకుండా కైలాసం నుంచి వేములవాడకు వచ్చాడని , అయన వెంటే నంది వేములవాడకు రావడం తో వృషభుని భక్తికి మెచ్చిన శివుడు రాజన్న ఆలయంలో తనకు కోడెమొక్కులు చెల్లించి తనతో సమానంగా చూస్తారని వరమిచ్చినట్లుగా స్థానికంగా కథనం ప్రచారంలో ఉంది.

Post a Comment

0 Comments