Ad Code

Responsive Advertisement

పయోవ్రతం

  • ఈ వ్రతాన్ని పాల్గుణమాసంలో మొదటిరోజున అంటే శుద్ధ పాడ్యమి రోజున ప్రారంభించి, ద్వాదశిరోజున ముగించాలి.
  • ఈ వ్రతం గురించి భాగవతంలో చెప్పబడింది.
  • సంతాన ప్రాప్తి కోసం ముఖ్యంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. 
  • ఈ వ్రతంలో రోజు తెల్లవారుజామునే లేచి, స్నానాదికాలు చేసి ముందుగా సూర్యభగవానునికి అర్ఘ్యం ఇవ్వాలి.
  • విష్ణుమూర్తిని షోడశ ఉపచారాలతో విధివిధానంగా పూజించాలి. స్వామికి పాలును నైవేద్యంగా సమర్పించి, పూజ తరువాత పాలను ప్రసాదంగా స్వీకరించాలి.
  • 11వ రోజైన ఏకాదశి నాడు విష్ణు పూజ తరువాత విధిగా, ఉసిరిక చెట్టును పూజించి, ప్రదక్షిణాలు చేయాలి.
  • వ్రతం చివరి రోజైన ద్వాదశి నాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి, దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి.
  • ఈ వ్రతాన్ని కశ్యప మహర్షి భార్య అదితి ఆచరించి వామనుణ్ణి పుత్రినిగా పొందింది.
  • ఈ వ్రత ఆచరణ వల్ల విష్ణు కృప లభించి ఇహలోకంలో సౌఖ్యం, పరలోకంలో మోక్షం లభిస్తాయి.
2021 : మార్చి  14 నుండి 

Post a Comment

0 Comments