Ad Code

Responsive Advertisement

శ్రీ లక్ష్మినరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అహోబిలం - 2021

అహోబిలంలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు మార్చి 18 నుండి ప్రారంభంకానున్నాయి.



వాహన సేవల వివరాలు

మార్చి 18

ఎగువ అహోబిలంలో అంకురార్పణ,

దిగువ అహోబిలంలో సెల్వార్ కూత్తు ఉత్సవం

మార్చి  19

ఎగువ అహోబిలంలో ధ్వజారోహణం, భేరి పూజ, సింహవాహనం.

దిగువ అహోబిలంలో అంకురార్పణ

మార్చి 20

ఎగువ అహోబిలంలో హంస వాహనం, అభిషేకం, సూర్యప్రభ వాహనం.

దిగువ అహోబిలంలో ధ్వజారోహణం, భేరి పూజ, సింహవాహనం.

మార్చి  21

ఎగువ అహోబిలంలో ఉత్సవం, అభిషేకం, హనుమంత వాహనం

దిగువ అహోబిలంలో హంస వాహనం, అభిషేకం, సూర్యప్రభ వాహనం.

మార్చి  22

ఎగువ అహోబిలంలో శేష వాహనం, చంద్రప్రభ వాహనం

దిగువ అహోబిలంలో యోగ నృసింహ గరుడ విమానం, అభిషేకం, హనుమంత వాహనం

మార్చి 23

ఎగువ అహోబిలంలో ఉత్సవం, అభిషేకం, శరభ వాహనం

దిగువ అహోబిలంలో శేష వాహనం, అభిషేకం, చంద్రప్రభ వాహనం

మార్చి  24

ఎగువ అహోబిలంలో ఉత్సవం, అభిషేకం, పొన్నచెట్టు వాహనం

దిగువ అహోబిలంలో ప్రహ్లదవరదుడికి మోహిని అలంకారం,  అభిషేకం, శరభ వాహనం

మార్చి 25

ఎగువ అహోబిలంలో  అభిషేకం, గజ వాహనం(సాయంత్రం), తిరుకల్యాణోత్సవం(రాత్రి).

దిగువ అహోబిలంలో వేణుగోపాల స్వామి అలంకారం, అభిషేకం, పొన్నచెట్టు వాహనం

మార్చి  26

ఎగువ అహోబిలంలో ఉత్సవం, తొట్టి తిరుమంజనం, అశ్వ వాహనం

దిగువ అహోబిలంలో అభిషేకం, గజ వాహనం(సాయంత్రం), తిరుకల్యాణోత్సవం(రాత్రి).

మార్చి  27

ఎగువ అహోబిలంలో  రథోత్సవం, అభిషేకం

దిగువ అహోబిలంలో  తొట్టి తిరుమంజనం(సాయంత్రం), అశ్వ వాహనం(రాత్రి)

మార్చి  28

ఎగువ అహోబిలంలో ఉత్సవం,చక్ర స్నానం, ద్వాదశారాధనం(సాయంత్రం), ఫుష్ప యాగం, గరుడ వాహనం(రాత్రి), ధ్వజావరోహణం

దిగువ అహోబిలంలో రథోత్సవం

మార్చి 29

దిగువ అహోబిలంలో ఉత్సవం, తీర్థవారి చక్రస్నానం, ద్వాదశారాధనం ఫుష్ప యాగం, గరుడ వాహనం(రాత్రి), ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగుస్తాయి.

మార్చి  30 నుండి ఏప్రిల్ 01 వరకు

దిగువ అహోబిలంలో ఉత్సవమూర్తులు ప్రహ్లదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి, అమ్మవార్లకు తెప్పోత్సవం

ఎలా వెళ్ళాలి :

ఆళ్లగడ్డ నుండి 24  కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం 


Post a Comment

0 Comments