Ad Code

Responsive Advertisement

ఆంధ్రప్రదేశ్ లో చూడవలసిన ఆలయాలు

ద్వారకా తిరుమల
  • చిన్న తిరుపతిగా ప్రసిద్ధి
  • ఆశ్వయుజ, వైశాఖ మాసాలలో తిరుకళ్యాణం జరుగుతుంది 
  • ఏలూరు నుండి 42 కి.మీ 
శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం - పాలకొల్లు
  • శ్రీ మహావిష్ణువు ప్రతిష్టించిన శివలింగం
  • పంచారామాలలో ఒక్కటి
  • రాష్ట్రంలో ఎత్తైన గోపురాలలో ఈ ఆలయం ఒక్కటి
శ్రీ సోమేశ్వర ఆలయం - భీమవరం 
  • పంచారామాలలో ఒక్కటి
  • అమావాస్య రోజున ఈ లింగం నలుపుని మించిన గోధుమ రంగులోకి, పౌర్ణమి రోజు ధవళ వర్ణానికి మారుతుంది 
ఈశ్వరాలయం - యనమదుర్రు

వీరభద్ర క్షేత్రం - పట్టిసీమ 
  • రాజమండ్రి నుండి 50 కి.మీ
శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం - ఆచంట 
శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం

శ్రీ అభయ అంజనేయ స్వామి వారి ఆలయం - హనుమాన్ జంక్షన్
  • హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి
శ్రీ దుర్గలక్ష్మనేశ్వర స్వామి వారి ఆలయం - నర్సాపూర్

నట్టా రామేశ్వర ఆలయం 
  • పాలకొల్లు నుండి 20 కి.మీ
శ్రీ రాట్నాలమ్మ వారి ఆలయం - పశ్చిమ గోదావరి 
  • చైత శుద్ధ పౌర్ణమి నుండి తిరునాళ్లు జరుగుతాయి 
  • ఏలూరు నుండి 15 కి.మీ 
శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం - తూర్పు యడపల్లి
శ్రీ మదన గోపాల స్వామి వారి ఆలయం - పాలకొల్లు 

శ్రీ ఆదికేశవ స్వామి వారి ఆలయం - నర్సాపూర్ 
  • ఏప్రిల్, మే మాసాలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
శ్రీశ్రీ శ్రీ  మావుళ్లమ్మ అమ్మవారి ఆలయం - భీమవరం 
  • జ్యేష్ఠా శుద్ధ పాడ్యమి నుండి నెల రోజులపాటు జాతర జరుగుతుంది 
శ్రీ దానేశ్వరి అమ్మవారి ఆలయం - దువ్వ 

శ్రీ కూర్మనాథ వేణుగోపాల ఆలయం - ఆకివీడు 
  • శ్రీ కూర్మం తరువాత విశిష్టమైన కూర్మనాథ ఆలయం
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం - పెనుగొండ 
శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయం - తణుకు (తేతలి).


తల్పగిరి శ్రీ రంగనాధ స్వామి
  • ప్రముఖ వైష్ణవ క్షేత్రాలలో ఒక్కటి 
  • నిత్యా కల్యాణోత్సవం, బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
  • ఈ ఆలయం ఉత్తర రంగమని వైష్ణవ పండితుల భావం 
నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు 

అలగనాధ ఆలయం - ఆత్మకూరు 
  • చోళ రాజులూ నిర్మించిన ఆలయం ఇది.
శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయం - కొండా బిట్రగుంట
  • సుమారు 200  సంవత్సరాల క్రితం నిర్మించింది ఈ ఆలయం 
కాశీవిశ్వనాధ ఆలయం - వేంకటగిరి

అళఘుమల్లారికృష్ణస్వామి - మన్నారుపోలూరు
  • శ్రీకృష్ణ లీలలతో సంబంధం ఉన్నది ఈ ఆలయం 
  • 10వ శతాబ్దపు దేవాలయం
  • శ్రీ కృష్ణుడు, జాంబవంతుల మధ్య మల్ల యుద్ధం జరిగింది ఇక్కడే అని అంటారు. 
శివ, పెరుమాల స్వామి ఆలయాలు - ప్రభగిరి పట్నం 
  • 15వ శతాబ్దపు దేవాలయం
శ్రీ లక్ష్మి సమేత నరసింహస్వామి - పెంచలకోన
  • స్వయంభూగా వెలసినట్టు స్థల పురాణం
  • నవ నరసింహ ఆలయాలలో ఒక్కటి
  • వైశాఖ శుద్ధ ఏకాదశినాడు బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి 
  • భరతుని బాల్యక్రీడలతో ఈ పవిత్ర క్షేత్రం పునీతమైంది అని చెబుతారు
శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయం - జొన్నవాడ 
  • శ్రీ శంకరాచార్య ఆలయంలో ప్రతిష్టించిన శ్రీ చక్రం నేటికీ చూడవచ్చు
  • ఏప్రిల్ - మేలో అమ్మవారి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి 
శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం - వేదగిరి
  • 9వ శతాబ్దంలో పల్లవ రాజు ఆలయం నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది.
  • సప్తమహర్షులు ఈ కొండ పై యజ్ఞం చేసినట్లు బ్రహ్మపురాణం వల్ల తెలుస్తుంది.
  • కొండమీద ఏడు కోనేరులు ఉన్నాయి.
  • మే నెలలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 
శ్రీ చెంగాళమ్మ అమ్మవారి దేవస్థానం - సూళ్లూరుపేట
  • అమ్మవారు స్వయంగా మహిషాసురమర్దిని రూపం లో వెలిశారు.
  • ఈ ఆలయానికి తలుపులు ఉండవు.
శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారి ఆలయం - నెల్లూరు
  • 1400 సంవత్సరాల క్రితం నిర్మించింది ఈ ఆలయం
  • తిక్కన సోమయాజి ఈ క్షేత్రాన్ని దర్శించిన తరువాత మహాభారతాన్ని తెలుగులో రచించాడు అని చెబుతారు
శ్రీ రామలింగేశ్వర  స్వామి వారి ఆలయం - రామతీర్థం 

శివాలయం - సంగం 

సోమేశ్వరస్వామి ఆలయం - సోమశిల

భగవాన్‌  వెంకయ్యస్వామి ఆశ్రమం - గొలగమూడి 

నరవాడ వెంగమాంబ పేరంట్రాళ్లు

సుబ్రమణ్యశ్వరస్వామి ఆలయం - మల్లం 

పోలేరమ్మ - వేంకటగిరి 

ముత్యాలమ్మ - తూర్పు కనుపూరు 

కలుగోళమ్మ - కావలి

ఇరుకుల పరమేశ్వరి అమ్మవారు - నెల్లూరు

చాముండేశ్వరీ ఆలయం - ఇందుకూరుపేట 

వీరభద్ర ఆలయం - లేపాక్షి 
  • 108 శైవ క్షేత్రాలలో ఒక్కటి అని స్కాందపురాణం వల్ల తెలుస్తుంది.

శ్రీ నరసింహ స్వామి దేవాలయం - ఆత్మకూరు 
  • అనంతపురం నుండి 25 కి.మీ 

రుక్మిణి సమేత పాండురంగస్వామి ఆలయం - బొమ్మనహాళ్ 
  • మద్యం మానిపించే దైవం అని భక్తుల నమ్మకం
  • మద్యం మనాలి అనుకున్నవాళ్ళు ఈ ఆలయంలో మాలధారణ చేస్తారు.
  • ప్రతి ఏకాదశి తిధికి భక్తుల రద్దీ ఉంటుంది 
వేమన గుడి - కటారుపల్లి
  • శ్రీరామనవమి సమయంలో మూడురోజుల పాటు తిరునాళ్లు జరుగుతాయి.
  • కదిరి నుండి 12 కి.మీ
శ్రీ రంగనాధ స్వామి  ఆలయం - బొలికొండ
  • రాయలసీమలో సుప్రసిద్ధ రంగనాధ క్షేత్రం.
కోన మల్లేశ్వర దేవాలయం - పార్నపల్లి 
  • ఈ ఆలయాన్ని జనమేజయ చక్రవర్తి నిర్మించాడు అని పురాణాలూ చెబుతున్నాయి.
  • కార్తీకమాసంలో ఉత్సవాలు జరుగుతాయి 
  • ఈ క్షేత్రంలో శివునికి ప్రతిరూపంగా పంచలింగాలు వున్నాయి.
  • ఈ క్షేత్రంలో కోనేరులో నీరు నంది విగ్రహం నోటి నుండి ధారగా ప్రవహిస్తుంది.
శ్రీ నరసింహస్వామి ఆలయం - కదిరి 
  • 13 వ శతాబ్దంలో ఆలయ నిర్మాణం జరిగింది.
  • పాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
శ్రీ బుగ్గ సంగమేశ్వర ఆలయం 
  • 15 వ శతాబ్దపు ఆలయం
  • దక్షిణ కాశీగా పిలుస్తారు.
  • ఈ కోనేరులో స్నానం ఆచరిస్తే సకల రోగాలు పోతాయి అని భక్తుల నమ్మకం
  • గుంతకల్ నుండి 7 కి.మీ 
హేమావతి సిద్దేశ్వర ఆలయం - అమరాపురం 
  • శివుడు విగ్రహ రూపంలో కొలువైవుంటాడు 
  • 7 వ శతాబ్దపు ఆలయం
  • మహాశివరాత్రి రోజున మూలవిరాట్ నుదిటిపైనా సూర్యకిరణాలు పడుతాయి.
  • ఈ కోనేరులో స్నానం ఆచరిస్తే సంతానం కలుగుతుంది అని నమ్మకం
  • శివరాత్రి అప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
  • శ్రావణమాసంలో జాతర, కార్తీకమాసంలో విశేష పూజలు, దసరా నవరాత్రులు వైభవంగా జరుగుతాయి.
  • అనంతపురం నుండి 140 కి.మీ
చింతల వెంకటరమణ స్వామి ఆలయం -  తాడిపత్రి  
బుగ్గ రామలింగేశ్వర ఆలయం - తాడిపత్రి  

శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయం - ధర్మవరం
శ్రీ లక్ష్మి నరసింహ ఆలయం - పెన్నా అహోబిలం

శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి వారి ఆలయం - కసాపురం 

శ్రీ రంగనాధ స్వామి ఆలయం - అల్లూరుకొన

శ్రీ పేట వెంకటరమణ ఆలయం - హిందూపురం 
  • 600 ఏళ్ళ క్రితం ఆలయం 
  • స్వామి వారు తిరుమలలో శ్రీవారిని పోలి వుంటారు 
  • మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి 
శ్రీ కాశీ విశ్వేశ్వర కోదండ రామాలయం - అనంతపురం.

తిరుమల

  • ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆలయం 
  • శ్రీ కృష్ణ దేవరాయలు అనేక విధాలుగా అభివృద్ధి చేసారు.
  • ఈ ఆలయంకు వచ్చే భక్తులు తలనీలాలు అధికసంఖ్యలో సమర్పిస్తారు
  • ఈ క్షేత్రం ఎప్పుడు నిత్యకల్యాణం పచ్చతోరణంగా ఉంటుంది.
  • ఆశ్వయుజ మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
  • ఈ ఆలయంలో ఏడాదికి 450 కి పైగా ఉత్సవాలు జరుగుతాయి.

శ్రీకాళహస్తి 

  • పంచభూత లింగాలలో ఇక్కడ వాయు లింగం 
  • శ్రీ అంటే సాలెపురుగు, కాళము అంటే పాము, హస్తి అంటే ఏనుగు.
  • ఇక్కడ భక్తకన్నప్ప ఆలయం కూడా వుంది.
  • మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

మిగతా ఆలయాలు అప్డేట్ చేస్తాం 

Post a Comment

0 Comments