Ad Code

Responsive Advertisement

శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయం - శ్రీశైలం.

శ్రీశైలమహాక్షేత్రం ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో నల్లమల అడవుల నడుమ కృష్ణనదికి కుడివైపున ఉంది.



ఈ జ్యోతిర్లింగక్షేత్రం అష్ఠాదశ మహాశక్తి పీఠాలలో కూడా ఒకటి కావడంచేత ఎంతో ప్రాశస్త్యం పొంది ఇలలో వెలసిన కైలాసంగా పేరుపొందింది. అమ్మవారు ఈ క్షేత్రంలో భ్రమరాంబగా కొలువుతీరింది.

శ్రీశైలక్షేత్రం భూమండలానికి నాభిస్థానమని స్కంద పురాణం అంటోంది.అందుకే మనం వివిధ వైదిక కర్మలను అంటే పూజలు,వ్రతాలు మొదలైన వాటిని ఆచరించేటప్పుడు చెప్పుకునే సంకల్పంలో " శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే ... శ్రీశైలస్య ఉత్తర దిగ్బాగే " అంటూ మన ఉనికిని శ్రీశైల క్షేత్రాన్ని కేంద్రంగా చేసుకుని చెబుతాం. 

మల్లికార్జునుడు పర్వతుని తపస్సు కారణంగా ఇక్కడ స్వయంగా ఉద్బవించగా, క్షేత్ర అధిదేవత అయిన భ్రమరాంబదేవి అరుణాసురుడునే రాక్షసుని సంహరించి ఈ క్షేత్రంలో స్వయంగా వెలసింది. 

శాతవాహనులు, కాకతీయులు, విజయనగర  రాజులు మొదలగు వారు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు .దేవాలయం నాలుగు దిక్కులా ఎత్తైన గోపురాలు,చుట్టూ పెద్ద ఖాళీ స్థలం, చుట్టూ ఆలయాలతో ఈ మహాక్షేత్రం అలరారుతుంది. 

శ్రీశైలక్షేత్రంలో వున్నా చిన్న నంది కొమ్ముల మధ్యలో నుండి శ్రీశైలశిఖరాన్ని చుస్తే పునర్జన్మ ఉండదు అని భావిస్తారు. దర్శించదగ్గ స్థలాల్లో పాలధార - పంచదార, హఠకేశ్వరం, దేశంలో మరి ఎక్కడలేని ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం, శ్రీశైలం కి వెళ్లినట్టు సాక్ష్యం చెప్పే సాక్షి గణపతి ఆలయం,పాతాళగంగ .. ఇవి కాకా చాల దర్శించవలసిన ప్రదేశాలు వున్నాయి.

ముఖ్యమైన పండుగలు :

ప్రతి మాసంలో ఉత్సవాలు జరుగుతుంటాయి .
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 
ఉగాది ఉత్సవాలు 
దసరా నవరాత్రులు
కుంభోత్సవం
సంక్రాంతి ఉత్సవాలు 
కార్తీక మాస ఉత్సవాలు 
శ్రావణ మాస ఉత్సవాలు 
మాస శివరాత్రి 
పౌర్ణమి
మూల నక్షత్రం 

ఆలయ వేళలు

ఉదయం 5.00 నుండి రాత్రి 9.00  వరకు 

ఎలా వెళ్ళాలి :

దోర్నాల నుండి 50 కి.మీ 
మార్కాపురం రైల్వే స్టేషన్ నుండి 81 కి.మీ 

చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :

దోర్నాల అయ్యప్ప స్వామి ఆలయం - 50 కి.మీ 
మార్కాపూర్ చెన్నకేశవ ఆలయం - 82 కి.మీ 
త్రిపురాంతకం శ్రీ బాల త్రిపురసుందరి ఆలయం - 94 కి.మీ 


Post a Comment

0 Comments