Ad Code

Responsive Advertisement

శ్రీకాళహస్తీశ్వర ఆలయం - శ్రీకాళహస్తి




పరమేశ్వరుడు వాయులింగంగా కొలువుదీరిన క్షేత్రం శ్రీకాళహస్తి. ఇక్కడ స్వామివారు శ్రీకాళహస్తీశ్వరునిగా అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబికగా పూజలు అందుకుంటారు.

ఈ క్షేత్రంలో శ్రీ (సాలెపురుగు),కాళము (సర్పము), హస్తి (ఏనుగు) శివుని పూజించి, చివరకు శివునిలో ఐక్యమైనందున ఆ మూడింటి పేరు మీద శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది.

తిరుమల ఆలయాన్ని నిర్మించిన తొండమాను చక్రవర్తి ఈ ఆలయాన్ని నిర్మించారు. విజయనగర రాజులూ, చోళులు, పాండ్యలు ఈ ఆలయాన్ని అభివృధి చేసారు.

ఆలయంలో ఎత్తుగా వుండే  శివలింగం పైభాగంలో ఐదు శిరస్సుల సర్పము, పానవట్టం నుండి పై భాగం వరకు రెండు దంతాలు , క్రింద సాలీడు ఆకారం ఉంటాయి. ఈ శివలింగాన్ని అర్చకులు కూడా తాకరు. దూరం నుంచే అభిషేకం చేసి, స్వామి కవచానికే ఆయా అలంకరణలు చేస్తారు.

గర్భాలయంలోని ఐదు దీపాలలో, రెండు దీపాలు మాత్రం ఎప్పుడూ చలిస్తూ ఉంటాయి. గాలి చొరబడే  అవకాశం ఏమాత్రం లేని గర్భాలయంలో రెండు దీపాలు మాత్రమే ఎప్పుడూ రెపరెపలాడుతూ వుండటాన్ని స్వామి వారి మహత్యంగా చెబుతారు. 

రాహు-కేతు పూజలకు ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. గ్రహణ సమయంలో కూడా తెరిచి ఉండే ఆలయం. 

ఈ ఆలయ ప్రాంగణంలో అనేక ఆలయాలు వున్నాయి. వాటిలో పాతాళ వినాయక స్వామి గుడి ప్రత్యేకమైనది. ఈ ఆలయంలో కొండమీద భక్త కన్నప్ప గుడి  ఉంది.

స్థలపురాణం ఇక్కడ క్లిక్ చేయండి 

ముఖ్యమైన పండుగలు

మహాశివరాత్రి 
బ్రహ్మోత్సవాలు 
కార్తీక మాస పూజలు

ఆలయ వేళలు మరియు పూజలు ఇక్కడ క్లిక్ చేయండి 

ఆలయ వేళలు :

ఉదయం 5.30 నుండి రాత్రి 9.00 వరకు 
శని, ఆదివారాలు రాత్రి 9.30 వరకు  

ఎలా వెళ్ళాలి :

నెల్లూరు నుండి 90 కి.మీ
తిరుపతి నుండి 30 కి.మీ 

చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :

గుడిమల్లం పురాతన శివాలయం - 28 కి.మీ 
తొండమానుడు శ్రీ వెంకటేశ్వర ఆలయం - 10 కి.మీ 
తిరుపతి ఆలయాలు - 40 కి.మీ 

Post a Comment

0 Comments