Ad Code

Responsive Advertisement

విష్ణు భక్తుడు - కులశేఖరుడు

  • కులశేఖర వర్మ కేరళ పాలకుడు. కులశేఖర ఆళ్వారుగా ప్రసిద్ధుడు.
  • పన్నెండు మంది వైష్ణవ ఆళ్వారులలో ఏడవ వాడు.
  • ఈయన మూడువేల సంవత్సరాల క్రిందట జీవించాడు అని వైష్ణవ గ్రంధాలు తెలియజేస్తున్నాయి.
  • శ్రీహరిలోని కౌస్తుభమని అంశంలో జన్మించాడు.
  • ముకుందమాల అనే నలబై శ్లోకాల దివ్యప్రబంధనాన్ని రచించాడు. వైష్ణవ క్షేత్రాలలో ముకుందమాల సామూహికంగా గానం చేస్తారు.
  • కులశేఖరుడు విష్ణుభక్తులను సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపంగా భావించి పూజించేవాడు. 
  • శ్రీకృష్ణుని తల్లి దేవకిగా తనను భావించుకొని కొన్ని శ్లోకాలను రచించాడు.శ్రీ రంగనాధుడిని సేవించుకున్నాడు.
  • తిరుమల శ్రీవేంకటేశ్వరుని గర్భాలయానికి ముందు వుండే గడపను కులశేఖర పడి అంటారు. అయన స్వయంగా ఆ గడపగా ఉండాలని వరం కోరుకొని సాధించాడు అని చెబుతారు.
  • ఇప్పటికి తిరుమల ఆలయంలో కులశేఖర పడి దాటుకుని అర్చకులు తప్ప వేరువ్వరు వేంకటేశ్వరుని సన్నిధికి వెళ్ళరు.


Post a Comment

0 Comments