Ad Code

Responsive Advertisement

శ్రీ కోనేటిరాయస్వామి వారి దేవస్థానం - కిలపట్ల

తిరుమలలో కొలువుదీరిన  శ్రీవెంకటేశ్వర స్వామి వారితో ముడిపడిన క్షేత్రాలు కొన్ని ఉన్నాయి. అందులో కిలపట్ల ఒక్కటి.



ఈ క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి " శ్రీ కోనేటిరాయస్వామి" పేరుతో పూజలు అందుకుంటున్నాడు.

కిలపట్ల  శ్రీ కోనేటిరాయస్వామిని భృగుమహర్షి ప్రతిష్టించినట్లు స్థలపురాణం.ఈ  ఆలయాన్ని 9, 10  శతాబ్దాలలో కాలంలో పల్లవులు నిర్మించారు. 2012 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ బాధ్యతలు స్వీకరించింది.



శ్రీ మహావిష్ణువుని కాలితో తన్నడం  వల్ల వచ్చిన పాపాన్ని పోగొట్టుకునే మార్గాన్ని సూచించమని  మహర్షులను కోరాడు భృగుమహర్షి. అప్పుడు కౌండిన్య మహర్షి సలహామేరకు భృగుమహర్షి ఏడు ప్రాంతాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టించినట్లు కధనం. అందులో కిలపట్ల ఒక్కటి.

వివాహ అనంతరం శ్రీనివాసమంగాపురం  చుట్టూ పక్కలప్రాంతాలలో పద్మావతి అమ్మవారితో శ్రీవారు పర్యటించసాగారు. అందులో కిలపట్ల ఒక్కటి. ఈ విషయం తెలిసిన మహర్షులు స్వామివారిని అక్కడ ఉండమని కోరారు. వారి కోరికతో స్వామివారు తన అంశ కోనేరులో వుంది అని, తీసి ప్రతిష్టించి పూజించమని సూచించాడు.

కోనేరులో లభించినందు వల్ల స్వామివారిని శ్రీ కోనేటిరాయ స్వామి అనే పేరు వచ్చింది.

శ్రీ కోనేటిరాయస్వామి వారి ఆలయం విశాలప్రాంగణంలో దర్శినమిస్తుంది.
శ్రీ కోనేటిరాయస్వామి రూపురేఖలలో తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని పోలి దర్శినమిస్తారు. గర్భాలయంలో కుడివైపున శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు కొలువైయున్నారు.
ఆలయప్రాంగణములో శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ వరాహస్వామి, శ్రీ చెన్నకేశవ స్వామి, ఆళ్వార్లను దర్శించుకోవచ్చు.

ఈశాన్యంలో స్వామివారి పుష్కరిణి ఉంది. ముందుగా శ్రీ  కోనేటిరాయస్వామి దర్శించుకున్నాకే తిరుమలకు వెళ్ళాలి అని స్థానికుల విశ్వాసం.

శ్రీ కోనేటిరాయస్వామి వారికీ ప్రతి సంవత్సరం వైశాఖమాసంలో శుక్లపక్ష అష్టమి మొదలు తొమ్మిది రోజులపాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.

ఆలయ వేళలు  : ఉదయం 6  నుండి రాత్రి 8 వరకు.

పలమనేరుకు  7 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం


Post a Comment

0 Comments