- జ్యేష్ట శుద్ధ దశమి రోజున భగీరధుని తపస్సు కారణంగా భూమిపై అవతరించింది.అందుకే ఈ దశమికి గంగోత్పత్తి దశమి అని పేరు.
- ఈ గంగోత్పత్తి దశమి సందర్భంగా జ్యేష్ట శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు అంటే పదిరోజులు పాటు గంగాదేవిని పూజించాలి అని వ్రత గ్రంధాలు చెబుతున్నాయి.
- ఈ పది రోజులు పూజలు చేయలేని వారు దశమి నాదైన గంగను పూజించడం మంచిది.
- అవకాశం వున్నవారు ఈ పదిరోజులు గంగస్నానం చేసి, గంగాతీరంలో గంగానదిని పూజించవచ్చు.
- వీలు లేని వారు చెరువులో, కాలువలో , బావి దగ్గర కానీ గంగానదిని తలుచుకుంటూ స్నానం చేయవచ్చు.
- స్నానం తరువాత షోడశ ఉపచారాలతో పూజించాలి. ఈ పూజలో పదిరకాల పూలు, పది రకాల నివేదనలు కూడా గంగాదేవికి సమర్పించాలి అని అంటారు.
ఈ పూజ వల్ల దశపాపాలు హరింపబడుతాయి
- పరుషంగా మాట్లాడడం
- అసత్యాలు చెప్పడం
- పరులను వంచించడం
- ఆసందర్భపు మాటలు మాట్లాడడం
- పరుల ధనాన్ని కోరడం
- ఇతరులకు కీడు తలపెట్టడం
- వృధాప్రయాస
- ఇతరులకు హాని చేయడం
- స్త్రీలను చెరచడం, అత్యాచారం చేయడం
- హత్య చేయడం
ఈ దశపాపాలను పోగొడుతుంది.
0 Comments