Ad Code

Responsive Advertisement

వటసావిత్రి వ్రతం


  • ఈ వ్రతాన్ని జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు చేయాలని స్కంద, భవిష్యోత్తర పురాణాలు చెబుతుండగా, అమావాస్య నాడు చేయాలని నిర్ణయామృతం చెబుతోంది.
  • వివాహితులైన స్త్రీలు వైధవ్యం రాకుండా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
  • ఈ వ్రతకథ మహాభారతంలో చెప్పబడింది.
  • భర్త ప్రాణాల కోసం యమధర్మరాజుని ఎదిరించిన సతీసావిత్రి వృత్తాంతం కారణంగా ఈ వ్రతం ఆచరణలోకి వచ్చింది.
  • ఈ వ్రతంలో స్త్రీలు వటవృక్షాన్ని(మర్రి చెట్టు) పసుపు కుంకుమలతో పూజించాలి.
  • దారానికి పసుపు పూసి, ఆ పసుపు దారాన్ని మర్రిచెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ దానికి చుట్టాలి.
  • ఈ విధంగా 108 ప్రదక్షిణాలు చేస్తూ, 108  చుట్లు చుట్టాలి.
  • ఈ దారం యమునితో ఐదవతనం కోసం పోరాడేందుకు చిహ్నంగా నిలుస్తుంది అని చెబుతారు.
  • ఈనాటి సాయంకాలం కనీసం ఐదుగురు ముత్తైదువులకు పసుపు కుంకుమలను, తాంబూలంతో పాటు పండ్లు దానం ఇవ్వాలి.
  • కొన్ని ప్రాంతాలలో ఈ వ్రతంలో బంగారం లేదా మట్టితో గాని చేసిన సావిత్రి సత్యవంతుల ప్రతిమలను పూజించే సంప్రదాయం కూడ ఉంది.
వ్రత కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

2020 : జూన్ 

Post a Comment

0 Comments