Ad Code

Responsive Advertisement

మహర్నవమి

  • దుర్గాష్టమి నాటి మరుసటి రోజు మహర్నవమి.
  • దేవీ నవరాత్రులకు ఇది అతి ముఖ్యమైన చివరిరోజు,దీన్నే మహానవమి అని కూడా పిలుస్తారు. 
  • నవరాత్రులలో పాడ్యమి రోజు నుండి అమ్మవారిని పూజించలేని వారు, కనీసం ఈ మహర్నవమి రోజైనా ఆ పరాశక్తిని పూజించడం శ్రేయస్కరం.
  • ఈ మహర్నవమి రోజున “ఆయుధపూజ” చేయడం సంప్రదాయంగా వుంది.
  • పూర్వం రాజులు ఈ మహానవమి రోజున తమ ఆయుధాలను, ఛత్రచామరాది రాజచిహ్నాలను, గజాశ్వాది వాహనాలను పూజించేవారట.
  • ఇదే ఆచారాన్ని మనం ఆయుధపూజగా ఆచరిస్తున్నాం.
  • ఈ రోజున తాము పనిచేసే యంత్రాలను అంటే రైతులు నాగలిని, వ్యాపారులు త్రాసు, తూనికరాళ్ళను, యిలా ఆయా రంగాలలో వుండేవారు తమకు ఉపకరించే వస్తువులను పూజిస్తే ఆయా వృత్తులందు అభివృద్ధి కలుగుతుంది.

Post a Comment

0 Comments