Ad Code

Responsive Advertisement

గురుశుక్ర మౌడ్యమి

మౌడ్యమి లేదా మూఢమి అంటే చీకటి అని అర్ధం.

మూఢమి అనేది అన్ని గ్రహాలకు ఉంటుంది. గురు, శుక్ర మౌడ్యమి మాత్రం మానవుల మీద ప్రభావం చూపుతుంది.

నవగ్రహాలలో గురు, శుక్ర గ్రహాలు శుభకార్యాలకు కారకాలు. ఇవి అనుకూలంగా ఉంటే శుభం జరుగుతుంది. 

ఈ గ్రహాలు సూర్యడికి చేరువలో సంచరిస్తున్నప్పుడు వాటి బలాన్ని కోల్పోతాయి, శుభఫలితాలు ఇవ్వలేవు.

కాబట్టి ఈ కాలంలో శుభకార్యాలు జరుపుకోరు.


ఏమి చేయాలి


జాతకర్మ, జాతకం రాయించుకోవడం, నవగ్రహ శాంతులు, జప, హోమాది శాంతులు, గండనక్షత్ర శాంతులు ఉత్పవాలు సీమంతం, నామకరణం, అన్నప్రాసనాది కార్యక్రమాలు గురు మౌడ్యమి వచ్చినా, ఇతర గ్రహాల మౌఢ్యమి వచ్చినా చేయవచ్చు.


గర్భిణీ స్త్రీలు, బాలింతలు తప్పనిసరి పరిస్థితితులలో మూఢాలలో ప్రయాణం చేయాల్సి వస్తే  శుభతిధులలో భర్తతో కలిసి ప్రయాణం చేయాలి.


ఏమి చేయకూడదు ?


పెళ్ళిచూపులు, వివాహం, ఉపనయనం, గృహారంభం గృహప్రవేశం, యజ్ఞాలు చేయుట, మంత్రానుష్ఠానం, విగ్రహ ప్రతిష్టలు, ప్రతాలు, నూతన వధువు ప్రవేశం, నూతన వాహనం కొనుగోలు, బావులు, బోరింగులు, చెరువులు తవ్వడం పుట్టువెంట్రుకలు, వేదా విధ్యారంభం, చెవులు కుట్టించుట, సూతన వ్యాపార ఆరంభాలు మొదలగునవి మౌడ్యమిలో వేయకూడదు.

2022: శుక్ర మౌడ్యమి సెప్టెంబర్ 15 నుండి డిసెంబర్ 02 వరకు.

Post a Comment

0 Comments