Ad Code

Responsive Advertisement

శ్రీ మొగిలేశ్వర స్వామి వారి ఆలయం - మొగిలి

శ్రీ మొగిలేశ్వర స్వామి వారి దేవస్థానం బంగారుపాలెం మండలం, మొగిలి గ్రామం చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలసింది. 


ఈ ఆలయంలో ప్రధాన దైవమైన శివుడు మొగిలేశ్వర స్వామిగా, అమ్మవారు కామాక్షిదేవిగా పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయాన్ని దక్షిణ కైలాసంగా పిలుస్తారు.


ఈ ఆలయంలో విశేషం ఎండాకాలంలో కూడా పుష్కరిణిలో నీరు నిండుగా ఉంటుంది, నంది విగ్రహం నోటిలోనుంచి నీరు పుషరిణిలోకి వస్తుంది. 


ఈ ఆలయాన్ని 10 వ శతాబ్దంలో నిర్మించారు. 


ఆలయ ప్రాంగణంలో వినాయక స్వామి, దక్షిణామూర్తి, బ్రహ్మ, దుర్గాదేవి కూడా దర్శనమిస్తారు. 


ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు విష్ణువు 


ఈ ఆలయంలో వివాహము చేసుకున్న వారికి కచ్చితంగా సంతానం కలుగుతుంది అని విశ్వాసం. 


మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి 


స్థల పురాణం 


శివుని శాపానికి గురియైన మొగిలి పూవు పలు విధాలుగా ప్రార్ధించి తన తప్పును మన్నించమని వేడుకుంది. అంతట పరమేశ్వరుడు భూలోకములో నీ పేరు మీదగా స్వయముగా అవతరించి పూజలు అందుకోనేదని వరము ఇచ్చెను. ఆ విధముగా పరమశివుడు స్వయముగా లింగా ఆకారములో మొగలి పొదల పక్కన ఒక చెలిమిలో అవతరించెను.


మొగిలి వారి గ్రామములో చాలా బీద వారైనా బోయ దంపతులు నివసించే వారు. ఆ బోయ వాని భార్య నిండు గర్భిని గా ఉన్నపుడు ఒక రోజు ఆమె వంట చెరుకు నిమిత్తము అడవికి వెళ్ళెను. అప్పుడు ఆమె కు అకస్మాతుగా నొప్పులు వచ్చి ఆ సమీపములోని మొగిలి పొదల వద్ద మగ శిశువును ప్రసవించింది. కనుక అతనికి మొగిలప్ప అని పిలవసాగిరి. మొగిలపు చిన్నతనము నుండే తల్లిదండ్రులకు సహాయముగా ఉండేవారు. అదే ఊరిలో పెద్ద రైతు ఇంటిలో పని కుదిరి ఆ ఇంటిలోని పశువులను ప్రతి రోజు అడవికి తీసుకొని వెళ్లి సాయంత్రము వరకు మేపి తిరిగి ఇంటికి చేరేవాడు. యజమానికి, తన ఇంటికి కావలసిన వంట చెరకును అడవి నుండి తెచ్చేవాడు. ఒక నాడు మొగిలప్ప అడవిలోని పశువులను సమీపములోని మొగిలి పొదలో వద్ద ఉండే చెరువులో నీరు పశువులకు త్రాపి అక్కడ ఉన్న ఎండిన మొగిలి పొదలను వంట చెరకు కోసము నరకసాగాడు. కొద్దిసేపటికి ఆకస్మాత్తుగా కంగుమని శబ్దము వినగా రక్తము కారుచున్నది, అది అంతంతకు అధికమై చెరువు అంతయు రక్తముతో కనిపించెను. అప్పుడు మొగిలప్ప భయపడి మొగిలి పొదలను తొలగించి చూడగా రక్తము ధారపాతముగా ప్రవహిస్తూ శివలింగము కనిపించెను. అప్పుడు మొగిలప్ప దగ్గరలోని ఆకులు, మూలికలు తెచ్చి పసరు పిండి గాయమును శుభ్రముగా తుడిచి కట్లు కట్టెను. అప్పటి నుండి మొగిలప్పకు శివుని పై అధిక భక్తి కలిగెను. ప్రతి రోజు శివ లింగాని దర్శించి తనకు తోచిన విధముగా సమీపములోని పూవులను, పండ్లను నైవేద్యముగా పెట్టెను.


ఆ విధముగా మొగిలప్ప శివ భక్తి అధికమై ఇంటి ద్యాస తగ్గిపోయినది. అతని తల్లి గమనించి కలవరపడెను. అతనికి పెళ్లి చేసినచో మనసు మారునని ఆ గ్రామములోని చక్కటి అమ్మాయని తెచ్చి వివాహము జరిపించను. అయినను అతనిలో మార్పు రాలేదు. ఇది ఇలాగ ఉండగా ఒక రోజు పశువుల మందలో ఒక ఆవు ఎక్కడికో వెళ్లి సాయంత్రమునకు మందలో వచ్చి ఉండేది. ఆ ఆవు పాలు సరిగా ఇవ్వకుండెను, అది గమనించిన యజమాని మొగిలప్పను మందలించెను. అందుకు మొగిలప్ప భాదపడి ఆ ఆవు ఎక్కడికి వెళ్లి వస్తునదో కనిపెట్ట సాగాడు. ఒక రోజు ఆ ఆవు క్రమం తప్పకుండా దేవరకొండ వైపునకు పయనించెను, అది గమనించిన మొగిలప్ప సదరు అవును వెంబడించెను. అది తిన్నగా దేవరకొండ పైకి ఎక్కి అక్కడ ఉన్న చిలము గుండా ప్రవేశించెను, మొగిలప్ప కూడా ఆ ఆవు తోకను పట్టుకొని బిలములోకి వెళ్ళగా అక్కడ ఆ ప్రదేశము అంత అమూల్య రత్నాలతో ప్రకాశవంతముగా ఉండెను. ఆ ఆవు ఏమి చేసెనో చూడసాగెను. అంత జగన్మాత పార్వతి దేవి బంగారు పాత్రను చేత పట్టుకొని అవును సమీపించాను. ఆ ఆవు పొదుగు నుండి దార పాత్రలో క్షీరముతో నిండెను. అది అంత మొగిలప్ప ఆశ్చర్యముగా చూస్తుండగా అంత పార్వతి దేవి గమనించి తన అనుమతి లేనిదే ఈ ప్రదేశానికి వచ్చి నందుకు శపించెను. అంత మొగిలప్ప పార్వతి దేవి పాదముల పై పడి వేడుకొనగా పార్వతి దేవి శాంతించి అతని కరునించాను. కానీ ఈ రహస్యము ఎవరికైన చెప్పినచో నీ తల వెయ్యి ముకలై మరిణించదవని హెచ్చరించెను.


మొగిలప్ప ఇంటికి చేరుకొని సర్వము తెగించి శివ ధాన్యంలో మునిగెను. ఎవరు పిలిచినా పలుకక ఏమియు తినక నిద్రహారాలు మానుకొని ఆలోచిస్తూ ఉండేవాడు. అంత అతని భార్య జరిగిన విషయము చెప్పమని ఎన్ని విధాలుగా అడిగినను చెప్పకపోవడముతో అతని కళ్ళ ఎదుటే  మరణిస్తానని బెదిరించి ఊరి పెద్దల తో పంచయతి పెట్టించాను. అంత మొగిలప్ప తనకు మరణం తప్పదు అని గ్రహించి ఊరి పోలిమేరలో చితి ఏర్పాటు చేసుకొని అందులో నిలబడి చేతులు జోడించి అందరి సమక్షములో ఆ రహస్యము తెలిపిను క్షణతన తల వెయ్యి ముక్కలై మరణించెను. అతని భార్య పశ్చతాపము చెంది తను కూడా ఆ చేతి లో పడి భర్తతో సహగమనం చేసెను. వారి ఇరువురు శివానుగ్రహం వల్ల కైలాసం చేరిరి. 


ఆలయ వేళలు 

సోమవారం 

ఉదయం 4.30 నుండి 11.30 వరకు, సాయంత్రం 5.00 నుండి 8.00 వరకు 

మంగళవారం నుండి ఆదివారం 

ఉదయం 6.00 నుండి 10.30 వరకు, సాయంత్రం 5.30 నుండి 8.00 వరకు 


ఎలా వెళ్ళాలి 

చిత్తూరు నుండి  30 కి.మీ దూరం 


Post a Comment

0 Comments