Ad Code

Responsive Advertisement

దీపావళి

 

  • దీపావళి పండుగ ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు వస్తుంది. స్వాతి నక్షత్రంతో కలిసిన అమావాస్య నాడు దీపావళి జరుపుకోవాలని శాస్త్రం. 
  • దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం.
  • దీపావళి పండుగను చీకటిపై వెలుగు, అసత్యంపై సత్యం సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు.
  • ఈ రోజు తెల్లవారుజామునే తలంటు స్నానం చేయాలి, ఈ రోజు చేసే స్నానం పాపాలను హరింపచేయడమే కాకుండా గంగాస్నానంతో సమానమైన ఫలితం ఇస్తుంది.
  • ఈ రోజు  తప్పనిసరిగా మహాలక్ష్మి పూజ చేస్తారు. 
  • ఈ రోజు లక్ష్మీదేవిని కలశంలోగాని, ప్రతిమ రూపంలోగాని, ధన రూపంలోగాని, లక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజించాలి.
  • కొన్ని ప్రాంతాలలో లక్ష్మిగణపతి విగ్రహాలను ఆరాధిస్తారు.
  • పూజా కార్యక్రమాలు పూర్తిచేసి, నూనెతో దీపాలు వెలిగించి, ఇంటిలో, ఇంటి పరిసరాల్లో, గోశాలల్లో దీపాలు పెట్టాలి.
  • ఈ రోజు పితృ దేవతలను స్మరించుకునే ఆచారం కూడా ఉంది. 
  • దీపావళి నాటి రాత్రి ఆనందోత్సాహాలతో బాణసంచా కాల్చాలి.
  • ఈ రోజు రాత్రి డిండిమం అనే వాయుద్యాలని వాయిస్తూ జ్యేష్టలక్ష్మిని సాగనంపాలి అని శాస్త్ర వచనం. 


దీపావళినాడే రావణ సంహారం పూర్తి చేసి రాముడు అయోధ్యకు తిరిగి వచ్చాడని, పాండవులు అజ్ఞాతవాసం నుంచి తిరిగివచ్చారని, శ్రీ మహా విష్ణువు నరసింహ రూపంలో హిరణ్యకశిపుని వధించాడని, ధర్మరాజు రాజసూయం దిగ్విజయంగా సమాప్తం చేశాడని, వామనుడు బలి చక్రవర్తిని మూడడుగుల నేల దానం అడిగి, తన మూడో అడుగుతో బలిని పాతాళానికి తొక్కివేశాడు అని పురాణాల ద్వారా తెలుస్తోంది. 

2022 :  అక్టోబర్ 24.

Post a Comment

0 Comments