1854 - షిర్డీకి మొదటిసారి బాలయోగిగా వచ్చిన శ్రీసాయి


1857 - షిర్డీ నుండి వెళ్లిపోయిన శ్రీసాయి.


1858 - చాంద్ పాటిల్ పెళ్లి బృందంతో మళ్ళీ షిర్డీ వచ్చిన శ్రీసాయి.


1858 - సాయి అని తొలిసారి పిలిచిన మహల్సాపతి.


1886 - మూడురోజుల పాటు సమాధి స్థితికి వెళ్లి తిరిగి వచ్చిన శ్రీసాయిబాబా.


1896 - షిర్డీలో ఉరుసు ఉత్సవం ప్రారంభం.


1904 - ఊది మహిమ ద్వారా ఒక భక్తురాలుకు సుఖ ప్రసవం.


1908 - తొలిసారి గురుపూర్ణిమ నిర్వహించిన బాబా భక్తులు.


1908 - సాఠె వాడ నిర్మాణం.


1909 - చావడిలో రోజు విడిచి రోజు నిద్ర చేసిన సాయిబాబా.


1910 - బిడ్డను రక్షించేందుకు ధునిలో చెయ్య పెట్టిన సాయిబాబా.


1911 - ద్వారకామాయికి మరమత్తులు చేయించిన భక్తులు.


1912 - శ్రీ రామనవమి ఉత్సవాలు ప్రారంభం.


1912 - గురుస్థాన్ వద్ద శ్రావణపౌర్ణమి రోజు పాదుకలు ప్రతిష్ట.


1915 - సమాధి మందిరం నిర్మాణం ప్రారంభం.


1917 - సాయిసత్చరిత్ర రచనకు హేమాడ్ పంత్ కు సాయి అనుమతి.


1918 - విజయదశమి రోజు బాబా మహానిర్యాణం.బూటీవాడాలో సమాధి.


1921 - షిర్డీసాయి సంస్థాన్ ఏర్పాటు.


1923 - సంస్థాన్ ఆధ్వర్యంలో తొలిసారి సాయిలీల మాసపత్రిక ప్రచురణ.


1929 - సాయిసత్చరిత్ర పూర్తీ.


1950 - సాయి సమాధి మందిర విస్తరణ.


1952 - షిర్డీ ఆలయ గోపురం పై బంగారు కలశ స్థాపన.


1954 -  సమాధి మందిరంలో బాబా పాలరాతి విగ్రహ ప్రతిష్ట.


2007 - షిర్డీ గోపురానికి బంగారు తాపడం , బాబాకు స్వర్ణ సింహాసనం.


2008 - షిర్డీలో గురుపూర్ణిమ శతాబ్ది ఉత్సవాలు.


2018 - షిర్డీలో సాయి సమాధి శతాబ్ది ఉత్సవాలు.



షిర్డీ సాయి ప్రస్థానంలో సాయిబాబా మహా భక్తులు.



1892 - బాబాను తొలిసారి  దర్శించుకున్న నానా సాహెబ్ చాందోర్కర్.


1894 - దాసగణు మహారాజ్ కు తొలిసారి సాయిబాబా దర్శనం.


1907 - షిర్డీ చేరుకున్న భక్తురాలు రాధాకృష్ణమాయి.


1908 - బాబాను తొలిసారి  దర్శించుకున్న మేఘ.


1910 - హేమాడ్ పంత్( సాయి సతచరిత్ర గ్రంధకర్త) కు తొలిసారి సాయి దర్శనం.


1911 - బాబా భక్తురాలు బాయిజాబాయి మరణం.


1916 - రాధాకృష్ణమాయి మరణం.


1917 - బాబాను  దర్శించుకున్న లోకమాన్య బాలగంగాధర్ తిలక్.


1918 - సాయి సమాధి తరువాత 13  రోజులకి నానావళి మరణం.


1922 - పరమభక్తుడు మహల్సాపతి కన్నుమూత.


1929 - హేమాడపంత్ మరణం.


1940 - బాబా ప్రియభక్తుడు శ్యామా కన్నుమూత.


1941 - ఉపాసని మహారాజ్ శివైక్యం.


1945 - తాత్యా పాటిల్ మరణం.


1962 - దాసగణు మహారాజ్ కన్నుమూత.


1965 - తొమ్మిది నాణేలు అందుకున్న లక్ష్మీబాయి షిండే మరణం.