స్కంద పురాణం లో కార్తీక మాసం విశిష్టత గూర్చి చెప్పబడింది.
కార్తీక మాసం లో నది స్నానం చేయటం వాళ్ళ1000 సార్లు గంగా నది లో స్నానంచేసిన ఫలితం,100 సార్లు మాఘ మాసం లో స్నానంచేసిన ఫలితం, కోటి సార్లు నర్మదా నది లో వైశాఖ మాసం లో స్నానం చేసిన ఫలితం వస్తుంది.
కుంభమేళా లో ప్రయాగ లో స్నానం చేసిన ఫలితం కార్తీక మాసంలో నది స్నానం వల్ల వస్తుంది.
పురాణాల ప్రకారం కార్తీక మాసం లో దానం చేయటం వల్ల, నది స్నానం వల్ల చేసిన పాపాలు అని నశిస్తాయి.
బ్రహ్మి ముహూర్తం లో లేచి స్నానం చేయాలి. తరువాత భగవంతుడిని దర్శించుకోవాలి.
సాయంత్రం దేవాలయం లో దీపం వెలిగించడం వల్ల యాగాలు చేసిన ఫలితం వస్తుంది.
కార్తీక అమావాస్య, కార్తీక పూర్ణిమ రోజు నది స్నానము చేసి శివాలయం లో దీపారాధన చేయాలి.
ప్రబోధిని ఏకాదశి, క్షీరాబ్ధి ద్వాదశి, వైకుంఠ చతుర్దశి రోజులో కూడా దీపారాధన చేస్తారు.
0 Comments