Ad Code

Responsive Advertisement

గోపేశ్వర మందిర్ - బృందావనం, ఉత్తరప్రదేశ్



ఈ ఆలయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బృందావనంలో ఉన్న పురాతన ఆలయాలలో ఒక్కటి. 


ఈ ఆలయంలో రాత్రి వేళల్లో శివుడికి స్త్రీ రూపంలో అలంకారం చేస్తారు.


వేల సంవత్సరాల క్రితం కృష్ణుని మనవడు అయిన వ్రజనాభ ఇక్కడ శివలింగాన్ని స్థాపించారు. ఇక్కడ ఆలయంలో శివుడిని సాయంత్రం గోపికగా అలంకరణ చేయడం వల్ల చాలా ప్రత్యేకంగా ఉంటుంది. శరదృతువులో పౌర్ణమి రాత్రి సుగంద, సువాసనల పరిమళాలతో యమునా నది ఒడ్డున శ్రీ కృష్ణుడు వేణువు వాయిస్తుండగా అక్కడ ఒక అందమైన ఆహ్లదకరమైన వాతావరణం నెలకొన్నది. ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో గోపిక నృత్యం చేస్తున్నది పరమశివుడు కైలాసంలో ధ్యానం చేస్తుండగా..బృందావనంలో శ్రీ కృష్ణుడి వేణు నాధం తీపి ధ్వని విని మంత్రముగ్గులై, కైలాసం వదలి బృందావన్ లో శ్రీ కృష్ణుడి రాసలీలను తిలకించడానికై వచ్చాడు.


పురాణాల ప్రకారం పరమ శివుడికి శ్రీకృష్ణుడితో కలసి రాసలో పాల్గొనాలనే కోరిక కలిగింది. రాసలో ఇతర పురుషులకు ప్రవేశం లేకపోవడం వలన, శివుడు స్త్రీ వేషాన్ని ధరించి రాసకు సిద్దపడుతాడు. అలా స్త్రీ రూపంలో ఉన్న శివుడిని చూసిన రాధ అసూయపడుతుంది. రాస జోరుగా జరుగుతున్నప్పుడు ..శివుడి మేలి ముసుగు జారిపోవడం వలన శివుడి నిజ రూపం అందరి కంట పడుతుంది.


సాక్షాత్తు ఆ పరమశివుడే అక్కడికి వచ్చినందుకు అందరూ ఆనందిస్తారు. గోపిక స్థానంలో ఈశ్వరడు వచ్చి నాట్యం చేయడం వల్ల శ్రీకృష్ణుడు శివుడికి గోపేశ్వర అని పేరు పెట్టారు. ఈ కారణం చేతనే ఇక్కడి దేవాలయంలోని శివలింగానికి రాత్రి వేళ స్త్రీ అలంకారం చేస్తారు. అందుకు నిదర్శనం అక్కడ శివలింగంపై కనిపించే చిహ్నాలు గోపిక వేలిముద్రలుగా చెబుతారు.


ఆలయ వేళలు


ఉదయం 5.00 నుండి రాత్రి 9.00 వరకు 


ఢిల్లీ నుండి 150 కి.మీ 


మథుర నుండి 11 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం.

Post a Comment

0 Comments