Ad Code

Responsive Advertisement

అయ్యప్ప స్వామి దీక్ష - సందేహాలు


 

అయ్యప్ప అంటే ఎవరు?


అయ్యప్ప అంటే "హరిహరసుతుడు". అంటే విష్ణువు (హరి) మరియు శివుడి (హరుడు) యొక్క కుమారుడు. "అయ్యా" - "అప్ప" కలిసి "అయ్యప్ప" అని అంటారు. అయ్యప్పని "మణికంఠుడు", "ధర్మశాస్త" అని కూడ అంటారు.


అయ్యప్పలు నల్లని దుస్తులు ఎందుకు ధరిస్తారు ?


శనీశ్వరుడికి నల్లని రంగు అంటే అత్యంత ఇష్టం. ఆ రంగు బట్టలని ధరించిన వాళ్ళకి శనిదేవుడు హాని కలిగించడు. అయ్యప్ప తన భక్తులను కాపాడటానికి నల్లని రంగు దుస్తులు ధరించమని చెప్తాడు.

అంతే కాక అయ్యప్ప దీక్ష శీతాకాలంలో చేస్తారు కాబట్టి నల్లని రంగు దుస్తులు శరీరానికి వేడిని ఇస్తాయి(శాస్త్రీయమైన కారణం).


కన్నె స్వామి అనగా ఎవరు ?


తొలిసారిగా అయ్యప్ప దీక్షను స్వీకరించిన భక్తుణ్ణి "కన్నెస్వామి" లేదా "కన్నిస్వామి" అని పిలుస్తారు.


మాల విశిష్టత ఏమిటి?


పూజా విధానములో జపమాలగా ఉత్కృష్ఠ స్థానాన్ని పొందే కంఠాభరణాలు రుద్రాక్ష, తులసి, చందనం, స్పటికం, పగడాలు మరియు తామర పూసల మాలలు శ్రేష్ఠమైనవిగా భావించబడుతున్నాయి. ఈ మాలధారణ మానవులు శారీరకంగా మరియు మానసికంగా ఎంతో ఉపయోగపడతాయి. అందుకే వీటిని పవిత్రమైనవిగా భావించి, ఈ మాలలకు అభిషేకము చేయించి, మంత్రోచ్చారణ ద్వారా అందు అయ్యప్పస్వామిని ఆవహింప చేసి వాటిని ధరించి భక్తులంతా త్రికరణశుద్ధిగా స్వామిని సేవించుకుందురు.


మాలధారణకు అర్హులెవ్వరు ? మాలధరించకూడని సందర్భాలు ఏవేవి ?


ఏవరైతే నియమములను పాటించుదురో, స్వామియందు ప్రేమానురాగములు కలిగియుందురో వారే అర్హులు. స్త్రీలలో 5 సంవత్సరముల నుండి 11 సంవత్సరముల వరకు, 50 సంవత్సరములు దాటిన వారు అర్హులు.

Post a Comment

0 Comments