Ad Code

Responsive Advertisement

Appalayagunta Brahmotsavams: శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 2023 - అప్పలాయగుంట


అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 31 నుండి జూన్ 8వ తేదీ వ‌రకు జ‌రుగ‌నున్నాయి. ఇందుకోసం మే 23వ తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, మే 30వ తేదీ సాయంత్రం అంకురార్పణ నిర్వ‌హిస్తారు. వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.


31-05-2023  ధ్వజారోహణం -పెద్దశేష వాహనం


01-06-2023   చిన్నశేష వాహనం   హంస వాహనం


02-06-2023      సింహ వాహనం  ముత్యపుపందిరి వాహనం


03-06-2023  కల్పవృక్ష వాహనం కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం


04-06-2023   మోహినీ అవతారం గరుడ వాహనం


05-06-2023 హనుమంత వాహనం  గజ వాహనం


06-06-2023        సూర్యప్రభ వాహనం   చంద్రప్రభ వాహనం


07-06-2023        రథోత్సవం   అశ్వవాహనం


08-06-2023     చక్రస్నానం  ధ్వజావరోహణం


బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూన్ 3వ తేదీ సాయంత్రం 4.30 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం బహుమానంగా అందజేస్తారు.

Post a Comment

0 Comments