Ad Code

Responsive Advertisement

ఉండ్రాళ్ళ తద్ది

  • భాద్రపద మాసం బహుళ తదియ నాడు దీనిని ఆచరిస్తారు.
  • పార్వతి దేవి తపస్సుకు మెచ్చి శివుడు ఆమెకు కనిపించిన  రోజు ఈ రోజు అని ధర్మ సింధువు చెబుతోంది.
  • ఈ రోజు కొత్తగా వివాహం అయిన స్త్రీలు గౌరీపూజను చేస్తారు.
  • పూజ తరువాత, ఉండ్రాళ్ళ తద్దె కథ చదువుతారు. అక్షతలు వేసుకుంటారు.
  • నారికేళాన్ని సమర్పించి, పొంగలి నైవేద్యం పెడుతారు.
  • పళ్లెంలో ఐదు ఉండ్రాళ్లు, పండ్లు, తాంబూలం ఐదు పోగుల తోరం ఉంచుతారు.
  • నోము నోచినా తోరాన్ని చేతికి ధరించి, ముత్తైదువులకు వాయనం ఇస్తారు.
  • ఈ నోము నోచే విధానంలో అనేక పద్దతులు కనిపిస్తాయి.
భాద్రపద బహుళ విదియ నాడు 

  • ఈ రోజు వివాహిత స్త్రీలు తలస్నానం చేసి కొత్త దుస్తులు ధరిస్తారు.
  • ఐదుగురు ముత్తైదువులకు గోరింటాకు ముద్ద, పసుపు, కుంకములు, కుంకుళ్ళు, నువ్వుల నూనె ఇచ్చి ఇంటికి తాంబూలం తీసుకోడానికి రండి అని ఆహ్వానిస్తారు. 
  • వివాహం కానీ ఆడపిల్లలు తెల్లవారుజామునే తలస్నానం చేసి గోంగూర పచ్చడితో పెరుగు అన్నం తింటారు.
  • తరవాత ఉయ్యాలలు ఊగుతూ కాలక్షేపం చేస్తారు. 

2022:   సెప్టెంబర్ 12. 

Post a Comment

0 Comments