Ad Code

Responsive Advertisement

ఆషాడ మాసం 2023




  • చాంద్రమానంలో నాల్గవ మాసం ఆషాడ మాసం.
  • ఈ మాసంలోని పౌర్ణమి నాడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రంలో కాని లేదా ఉత్తరాషాఢ నక్షత్రంలో కాని కలిసివుండటం చేత ఈ మాసం ఆషాఢంగా పేరుపొందింది.
  • ఈ మాసం శుభకార్యాలకు అంతగా అనువుకానప్పటికీ, ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది.
  • ఈ మాసంలో ఒంటిపూట భోజన నియమాన్ని పాటించడం వల్ల ఐశ్వర్యం లభించి మంచి సంతానం కలుగుతుంది అని శాస్త్రం.
  • ఈ నెలలో గృహనిర్మాణాన్ని ఆరంభించడం వల్ల గోసంపద లభిస్తుంది అని మత్య్స పురాణం చెబుతోంది.
  • ఈ నెలలో ఆడవారు కనీసం ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలంటారు, అలాగే ఆహారంలో మూలగాకు ఎక్కువగా వాడాలి.
  • జపపారాయణలకు ఈ మాసం అనువైనది. కొన్ని ప్రాంతాలలో ఈ మాసంలో కూడా పుణ్య స్నానాలు చేస్తారు.
  • ఈ మాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది.సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి నప్పటినుండి మకరరాశిలోకి ప్రవేశించే అంత వరకు గల కాలం దక్షిణాయనం.
  • దక్షిణాయన ప్రారంభసమయంలో పుణ్యస్నానాలను, ధాన్యజపాదులను చేయడం ఎంతో మంచిది.
  • ఈ సంక్రమణ సమయంలో చేసే పుణ్య స్నానాల వల్ల రోగాలు నివారించడమే కాక దారిద్య్రం నిర్ములింపబడుతుంది.
  • ఈ మాసంలో చేసే దానాలు విశేష ఫలితాలు ఇస్తాయి. పాదరక్షలు, గొడుగు, ఉప్పు, ఉసిరికాయలు దానం చేయడం వల్ల వామనుని అనుగ్రహం లభిస్తుంది.
  • ఈ మాసం లోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు పూర్ణిమ కూడా. దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు.
  • ఆషాడ శుద్ద విదియ నాడు పూరీ జగన్నాధ, బలభద్ర, సుభద్ర రథయాత్ర కన్నుల పండుగ గా జరుపుతారు.
  • ఆషాడ శుద్ద పంచమి స్కంధ పంచమి గా చెప్తారు. సుబ్రమణ్య స్వామి ని ఈ రోజు అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు.
  • ఆషాడ షష్ఠి ని కుమార షష్ఠి గా జరుపుకొంటారు.
  • ఆషాడ సప్తమి ని భాను సప్తమి గా చెప్పబడింది. (ఉత్తరం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న ప్రభాకరుడు మూడు నెలలు తర్వాత మధ్యకు చేరుకుంటాడు. ఆ రోజున పగలు, రాత్రి, నిమిషం ఘడియ విఘడియల తేడా లేకుండా సరిమనానం గా ఉంటాయి.)
  • ఆషాడ శుద్ద ఏకాదశి ని తొలి ఏకాదశి అని శయన ఏకాదశి అని అంటారు. ఈరోజు నుండి చాతుర్మాస వ్రతం ఆరంభమవుతుంది. దీనినే మతత్రయ ఏకాదశి అని అంటారు.
  • రుతుపవనాల రాక వల్ల వాతావరణం లో  కొంత మార్పు కనబడుతుంది. అప్పటి వరకు వున్నా ఎండలు నుంచి కొంత ఉపశమనం పొందుతారు. 

ఆషాడ మాసంలోనే తెలంగాణా ప్రాంతం లో సంప్రదాయబద్దమైన బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్దలతో జరుపుకొంటారు. మహంకాళి అమ్మవారి కోసం తయారు చేసే భోజనాన్ని బోనం గా చెప్తారు( భోజనానికి వికృతి పదమే బోనం) . దీనిని అమ్మవారికి నివేదన చేసే పర్వదినాన్నే బోనాలు అంటారు.


ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం లో ఈ పండుగ అత్యంత వైభవం గా జరుపుకొంటారు. సమస్త జగత్తుకు కారణమైనటువంటి అమ్మవారిని భక్తి శ్రద్దలతో పూజిస్తారు. అన్నం, బెల్లం, పెరుగు, పసుపు నీళ్ళు, వేపాకులు ఈ బోనం లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి హానికలిగించే వ్యాదుల నుండి ఉపకరించేవి. ఈ సమయం లో ప్రకృతి లో జరిగే మార్పుల వలన అనారోగ్యాలపాలు కాకుండా ఇవి ఎంతో మేలు చేస్తాయి.



అంతే కాకుండా, అనారోగ్య మాసం ఆషాడం. కొత్త నీరు త్రాగటం వల్ల చలి జ్వరాలు, విరోచనాలు, తల నొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం, స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు, అనారోగ్య దినాలలోను అశుభ సమయాల లోను, గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదనే నమ్మకం కూడా ఉంది. ఇన్ని కారణాల వల్ల ఆషాడమాసాన్ని కొన్ని పనులకు నిషిద్దం చేసారు మన పెద్దలు.

2023: జూన్ 19  నుండి జులై 17  వరకు.
 

Post a Comment

0 Comments