Ad Code

Responsive Advertisement

భస్మధారణ మహత్యం



శివభక్తులు మూడు రకాల విభూతులూ ధరిస్తారు.


  • యజ్ఞ యాగాలు చేసినప్పుడు హోమగుండంలో పుట్టే విభూతి శ్రోతం.
  • నిత్యాగ్ని హోత్రం, జ్వాలాతోరణం వంటి వైదిక క్రియల్లో పుట్టే విభూతి స్మార్తం.
  • ఆవు పేడను కాల్చడం ద్వారా వచ్చిన భస్మం లౌకికం.


పంచానన పరమేశ్వరుని ముఖాలు ఐదు అవి


  • సద్యోజాతం 
  • వామదేవం 
  • అఘోరం 
  • తత్పురుషం
  • ఈశనం.


సద్యోజాతం  నుండి భూమి పుట్టింది, కపిలవర్ణంలో  నందగోవు  రూపుదాల్చాయి,నందగోమయం ఎండబెట్టి మదించిన బూడిదను విభూతి అని అంటారు. ఇది ఐశ్వర్య కారకం.

వామదేవం నుండి నీరు పుట్టింది, నల్లని భద్రగోవు జన్మించాయి, భద్రగోమయం నుండి తయారు చేసింది భసితం. ఆయిష్షుని వృద్ధి చేస్తుంది.

అఘోరం నుండి అగ్ని పుట్టింది. రక్తవర్ణ అయిన సురభి గోవు పుట్టాయి, సురభి గోమయం నుండి తయారు అయింది భస్మం, సర్వ పాపాలను హరిస్తుంది.

తత్పురుషిని వల్ల వాయువు ఉద్బవించింది. తెల్లని సుశీలగోవు పుట్టాయి, ఆ గోమయం నుండి తయారు అయింది క్షారం అని పేరు, ఆపదలను నివారిస్తుంది.

ఈశానుని నుండి ఆకాశం, సుమన గోవు పుట్టాయి, ఆ గోమయం నుండి తయారు అయింది రక్షా అవుతుంది, భూత ప్రేత , పిశాచ , బ్రహ్మ రాక్షససుల నుండి కలిగే బయాలనుండి ఇది రక్షిస్తుంది.


  • విభూతి ధారణ స్నానం తో సమానం.
  • ఉదయం స్నానం చేసిన తరువాత తడి విభూతి, స్నానం చేయలేని అపుడు రాత్రి సమయాలలో పొడి విభూతి ధరించాలి.
  • ముందుగా విభూతి నొసట ధరించాలి
  • పూజ సమయాలలో నాభి కింద విభూతి ధరించరాదు.శరీరంలో ఏ భాగంలో విభూతి ధరిస్తే ఆయా భాగాలలో చేసిన పాపాలు నశిస్తాయి అని శివపురాణం చెపుతుంది.
  • మూడు రేఖలుగా దరించే విభూతి త్రిమూర్తులుగా భావిస్తారు.
  • పై నుంచి వరసగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకలు.
  • పవిత్ర నది సంగమ ప్రదేశలలో స్నానం చేసిన ఫలితం, ప్రధాన తీర్థాలలో స్నానం చేసిన ఫలితం విభూతి ధారణ వల్ల సిద్ధిస్తాయి. 

Post a Comment

0 Comments