Ad Code

Responsive Advertisement

జీవన్ముక్తి - లక్షణాలు


1. గతించిన దానిని స్మరింపకుండుట.

2. ప్రాప్తించిన దానితో సంతృప్తిపడుట.

3. జరగబోయే దానిని గురించి విచారించకుండుట.

॰ కష్టములను సహించలేనప్పుడు - క్రోధము వచ్చును.

॰ ఆహారనియమము గల వారికే క్రోధమును నిగ్రహించే శక్తి కలుగును.

॰ క్రోధము నిగ్రహించినప్పుడే పరమాత్మను మరుపు చేయించునట్టి విఘ్నములు వచ్చినను సులభముగా తొలగిపోవును.

॰ విఘ్నములు తొలగినప్పుడే తపస్సు వృద్ధియగును.

॰ తపస్సు వృద్ధియైనప్పుడే త్రిగుణములు జయించబడి ఆత్మసుఖము స్ధిరపడును.

॰ ప్రకృతి యొక్క గుణములతో కలిసియుండుట వలన జీవుడనబడును.

॰ ప్రకృతి గుణములు దాటినవారు పరమాత్మను చేరగలరు.

------- అదియే జీవన్ముక్తి.

Post a Comment

0 Comments