Ad Code

Responsive Advertisement

శ్రీ సూర్యాష్టకమ్‌



1. ఆదిదేవ ! నమస్తుభ్యం - ప్రసీద మమ భాస్కర |
దివాకర ! నమస్తుభ్యం - ప్రభాకర నమోస్తుతే

అర్థము : ఆదిదేవుడైన సూర్యభగవానునికి నమస్కారము, ఉదయభనుడు నన్ను కరుణించుగాక. దినాధిపతికి నమస్కారం. ప్రకాశ స్వరూపునకు నమస్కారం.

2. సప్తాశ్వరథ మారూఢం - ప్రచండం కశ్యపాత్మజం |
శ్వేతపద్మధరం దేవం - తం సూర్యం ప్రణమామ్యహమ్‌

అర్థము : ఏడు గుఱ్ఱములు గల రథమునందు పయనించువాడు అద్భుతంగా ప్రకాశించువాడు, కశ్యపుని కుమారుడు తెల్లని పద్మమును ధరించినవాడగు సూర్యభగవానునకు ప్రణమిల్లుచున్నాను.

3. లోహితం రథమారూఢం - సర్వలోకపితామహం |
మహాపాపహరం దేవం - తం సూర్యం ప్రణమామ్యహమ్‌.

అర్థము : ఎ ఱ్ఱని రథముపై పయనించువాడు సర్వలోకములకు ప్రభువు సర్వపాపములను నశింపజేయునట్టి సూర్యభగవానునకు ప్రణమిల్లుచున్నాను.

4. త్రైగుణ్యం చ మహాశూరం - బ్రహ్మ విష్ణుమహేశ్వరమ్‌ |
మహాపాపహరం దేవం - తం సూర్యం ప్రణమామ్యహమ్‌

అర్థము : సత్వ, స్తమో, రజో గుణములు దాల్చినవాడు మహాశూరుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకుడు సర్వపాపములను నశింపజేయునట్టి సూర్యభగవానునకు ప్రణమిల్లుచున్నాను.

5. బ్రంహితం తేజసాంపుంజం - వాయు రాకాశ మేవ చ |
ప్రియంచ సర్వలోకానాం - తం సూర్యం ప్రణమామ్యహమ్‌.

అర్థము : దేదీప్యమానముగ ప్రకాశించువాడు, అంతట వ్యాపించినవాడు సర్వలోకములకు ప్రభువు సూర్యభగవానునకు ప్రణమిల్లుచున్నాను.

6. బంధూకపుష్పసంకాశం - హారకుండలభూషితం |
ఏకచక్ర దరం దేవం - తం సూర్యం ప్రణమామ్యహమ్‌.

అర్థము : బంధూక పుష్ప వర్ణము కలవాడు, మెడలో హారము, చెవి పోగులు ధరించినవాడు కాల చక్రమును చేత ధరించినవాడు సూర్యభగవానునకు ప్రణమిల్లుచున్నాను.

7. తం సూర్యం జగత్‌కర్తారం - మహాతేజ: ప్రదీపనమ్‌|
మహాపాపహరం దేవం- తం సూర్యం ప్రణమామ్యహమ్‌.

అర్థము : సర్వ లోకపాలకుడైన సూర్యభగ వానుడు సర్వలోక ప్రభువు, సర్వ పాపములను నశింపజేయునట్టి సూర్యభగవానునకు ప్రణమిల్లుచున్నాను.

8. తం సూర్యం జగతాం నాథం - జ్ఞానవి జ్ఞానమోక్షదమ్‌ |
మహాపాపహారం దేవం - తం సూర్యం ప్రణమామ్యహమ్‌.

అర్థము : లోక పరిపాలకుడు, జ్ఞానము, విజ్ఞానము, మోక్షము నొసగువాడు సర్వపాపములను నశింపజేయునట్టి సూర్యభగవానునకు ప్రణమిల్లుచున్నాను.

9. సూర్యాష్టకం పఠేన్నిత్యం - గ్రహపీడా ప్రణాశనం |
అపుత్రో లభతే పుత్రం - దరిద్రో ధనవా న్భవేత్‌ |

అర్థము : ఈ సూర్యాష్టకం ప్రతీదినం పఠించిన వారికి గ్రహపీడలు నశించును. పుత్రులు లేని వారికి పుత్రులు కల్గుదురు. దరిద్రలు ధనవంతులగుదురు.

Post a Comment

0 Comments