Ad Code

Responsive Advertisement

సన్నిధి గొల్ల ( తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే మొదటి వ్యక్తి).



భృగు మహర్షి తపోఫలం విష్ణుమూర్తికి ఇవ్వదలచి వైకుంఠం చేరుకుంటాడు. భృగు మహర్షిని గమనించని విష్ణుమూర్తి ని కోపంతో భృగు మహర్షి విష్ణుమూర్తి హృదయం మీద కాలితో తంతాడు. అప్పుడు లక్ష్మీదేవి వైకుంఠం నుండి వెళ్లిపోతుంది.

లక్ష్మిదేవిని వెతుకుంటూ విష్ణుమూర్తి భూలోకం చేరుకుంటాడు. అప్పుడు చింతచెట్టు కింద వున్నా పుట్టలో ఉంటాడు. ఇది గమనించిన ఒక గోవు రోజు ఆ పుట్ట దగ్గర పాలధార కారుస్తూ ఉంటుంది. గోవు ఇలా చేయడం వాళ్ళ రాణికి సందేహం వస్తుంది. ఆ గోవు పాలు ఎవరు తాగుతున్నారు కనిపెట్టమని రాజు ఆ పశువుల కాపరిని ఆదేశిస్తాడు.

పక్కరోజు ఆ  పశువుల కాపరి విషయమంతా తెలుసుకొని ఆ ఆవు మీదకు గొడ్డలి విసురుతాడు. అప్పుడే పుట్టలోనుంచి స్వామి వారు పైకి లేవడంతో ఆ గొడ్డలి స్వామికి తగిలి రక్తం కారుతుంది. అపుడు భయంతో ఆ పశువుల కాపరి మరణిస్తాడు. అప్పుడు స్వామివారు కలియుగాంతం వరకు ఆ వంశంలో ని వారికీ మొదటి దర్శనం ఇస్తాను అని చెప్తాడు.

సన్నిధిగొల్ల ప్రతి దినం బ్రాహ్మీముహూర్తంలో 2.30 గంటలకు  నిద్రమేల్కొని శుచిగా స్నానం చేసి, తిరునామాలు ధరించి చిన్నదివిటీతో తిరుమల ఉత్తరమాడ వీధిలో వున్నా 'తిరుమాళిగ'(అర్చకస్వాములు) లను ఆలయానికి ఆహ్వానిస్తాడు. వారంతా బంగారు వాకిలి వద్దకు చేరుకున్న తరువాత సన్నిధిగొల్ల ఆలయానికి ప్రక్కన ఉన్న ' శ్రీ పెద్దజియ్యంగార్ల' మఠానికి వెళ్లి జియ్యంగారిని, వారి పరిచారికుడైన ' ఎకాంగి'ని ఆలయానికి ఆహ్వానిస్తారు.

తరువాత సన్నిధిగొల్ల ఆలయాధికారి ఐన 'పెస్కారు' దగ్గర ఉన్న తాళాలతో బంగారు వాకిళ్లు తెరుస్తారు. సన్నిధిగొల్ల, జియ్యంగార్లు, ఆలయ అధికారులు వీళ్ళ ముగ్గురు లేకుండా బంగారువాకిలిని వేయడంకాని, తీయడంకాని జరగదు.

బంగారు వాకిళ్లు తెరిచినా తరువాత సన్నిధి గొల్ల ముందు వెళ్తాడు, తరువాత అర్చకులు సుప్రభాతం ప్రారంభిస్తూ లోపలి వెళతారు. ముందుగా సన్నిధిగొల్ల శ్రీ వారిని దర్శించుకుంటారు.

ప్రతి రోజు ఉదయం, సాయంత్రం స్వామివారికి జరిగే తోమాల సేవకు ఫుష్ప అరలో ఉన్న పూలను తేవడానికి వెళ్లిన జియ్యంగార్లని, ఎకాంగిని సన్నిధిగొల్ల ఆలయానికి ఆహ్వానిస్తాడు.

ఆలయం నుండి ఉత్సవమూర్తులు బయటకు వస్తున్నప్పుడు, మళ్ళి లోపలికి వెళ్తున్నప్పుడు సన్నిధిగొల్ల దివిటీతో ముందు నడుస్తాడు.

భోగశ్రీనివాస మూర్తి శయనింపచేసే సమయంలో సన్నిధిగొల్ల తన చేతిలోని దివిటీతో శ్రీవారు పవళించే మంచానికి ముందు ఇరు వైపులా ఉన్న రెండు దీపపు  సమ్మెటలను ప్రతి రోజు వెలిగిస్తారు.

సుప్రభాత వేళలో నివేదించబడే ఆవుపాలు సన్నిధిగొల్లకు  ప్రసాదంగా  ఇస్తారు.

బ్రహ్మ తీర్థం, ప్రధమ తాంబూలంని సన్నిధిగొల్లకు ప్రసాదిస్తారు.

తోమాల సేవ, ఏకాంత సేవ, పారువేట ఉత్సవం మొదలైన సేవలలో సన్నిధిగొల్ల స్వామివారికి సేవలు అందిస్తారు.



                                                                                                                           

Post a Comment

0 Comments