Ad Code

Responsive Advertisement

ద్వారకాధీశ్ మందిరం - గుజరాత్

ద్వారకాధీశ్ మందిరం గుజరాత్ లోని ద్వారకలో ఈ ఆలయం ఉన్నది. ద్వారకాధీశ్ మరియు ద్వారక రాజు అన్న నామాలతో ఆరాధించబడుతూ శ్రీకృష్ణునికి అంకితం అయిన ఈ  దేవాలయం.  ఈ ఆలయనిర్మాణం చారిత్మాతకమైన ద్వారకా నగర నిర్మాణం తరువాత నిర్మించబడినదని విశ్వసించబడుతున్నది. మహాభారత యుద్ధానంతరం, శ్రీకృష్ణుని నిర్యాణం తరువాత శ్రీకృష్ణుని రాజ్యం సముద్రంలో మునిగి పోయింది. ప్రధాన ఆలయమైన జగత్ మందిర్ లేక నిజ మందిర్ ఆలయం 17 మూలస్థంభాల ఆధారంగా 5 అంతస్థులతో నిర్మించబడి ఉన్నది.



ఈ ఆలయ నిర్మాణం జరిగి 2,500 ఏళ్లు అయిందని అంచనా. ప్రస్తుత ఆలయం క్రీ.శ 16వ శతాబ్దంలో నిర్మించబడింది. మూల ఆలయనిర్మాణం శ్రీకృష్ణుని మనుమడైన వజ్రనాభుని చేత హరిగృహం (శ్రీకృష్ణుడు నివసించిన ప్రదేశం) ఉన్న ప్రదేశంలో నిర్మించబడిందని విశ్వసించబడుతున్నది. ఈ ఆలయం భారదేశంలోని పవిత్రమైన చార్‌ధాం హిందూ భక్తియాత్రలో ఒకటిగా భావించబడుతుంది. అధ్యాత్మికవాది, సంస్కర్త అయిన 8వ శతాబ్దానికి చెందిన ఆదిశంకరాచార్యుడు ఈ ఆలయాన్ని దర్శించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆలయంలో కూడా ఒక మందిరం ఈ సందర్భానికి గుర్తుగా నిర్మించబడి శంకరాచార్యునికి అంకితం చేయబడి ఉన్నది. దివ్యప్రబంధాలలో సూచించబడిన విష్ణుభగవానుని 108 దివ్యప్రదేశాలలో ఈ ఆలయం ఒకటి.

ఈ అద్భుత ఆలయం ఎత్తు 51.8 మీటర్లు. జగత్ మందిర్ అని కూడా పిలువబడుతున్న ఈ ఆలయానికి రెండు శిఖరాలు ఉన్నాయి. నిజశిఖరం అనబడే పెద్దశిఖరం గర్భాలయంలో శ్రీకృష్ణుడు ప్రతిష్టించబడి పూజలు అందుకుంటున్నాడు. ఈ బృహత్తరమైన ఆలయంలో అద్భుతమైన శిల్పకళానైపుణ్యం కలిగిన 60 స్తంభాలు, అనేకశిల్పాలు ఉన్నాయి.

ఆలయానికి ఉత్తరాన ఉన్న ద్వారాన్ని మోక్ష ద్వారం అని పిలుస్తారు. దక్షిణ ద్వారం స్వర్గ ద్వారం అని పిలువబడుతుంది.

2.25 అడుగుల శ్రీకృష్ణుని విగ్రహం చెక్కడానికి మెరిసే నల్లరాయి ఉపయోగించబడింది. భగవానుడి నాలుగు చేతులలో ఒకదానిలో శంఖం, మరొక చేతిలో సుదర్శన చక్రం, ఇంకో చేతిలో గద, నాలుగవ చేతిలో తామర పుష్పం ఉన్నాయి. ఈ విగ్రహాన్ని శంఖ, చక్ర, గదా, పద్మ చతుర్భుజి అంటారు. శత్రువుల దాడి నుండి రక్షించడానికి ఈ విగ్రహం సంవత్సరాల కాలం దాచి ఉంచబడింది. మధ్యకాలంలో రుక్మిణీ మందిరంలో ఉన్న విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. ప్రస్తుత ఆలయం నిర్మించబడిన తరువాత అసలైన విగ్రహం ప్రతిష్టించబడింది.

శ్రీ కృష్ణ జన్మాష్టమి, అక్షయ త్రితీయ, హోలీ, రథ యాత్ర, తులసి వివాహం ఈ ఆలయంలో జరిగే ముఖ్యమైన పండుగలు.

ఆలయ వేళలు : ఉదయం 6.30 నుండి మధ్యాహ్నం 1.00 వరకు 

                             సాయంత్రం 5.00  నుండి రాత్రి 9.00 వరకు 

ఎలా వేలాలి : దేశంలోని అన్ని ప్రాంతాల  నుండి ద్వారకా చేరుకోవచ్చు 

Post a Comment

0 Comments