Ad Code

Responsive Advertisement

కనుమ

తెలుగువారి సంక్రాంతి మూడురోజుల పండుగ. భోగి, మకర సంక్రాంతి తరువాత మూడవ రోజు కనుమ పండుగ.
కనుమ పండుగను కనుమూపులు పండుగ అని అంటారు. కనుము అంటే పశువు అని అర్ధం, పులు అనే తెలుగు మాటకు రత్నాలపై పేరుకునే మాలిన్యం, అల్పమైనది, కసువు అనే అర్ధాలున్నాయి.
కసువు అంటే గడ్డి, కనుమ పండుగ నాడు పశువులకు కనీసం గడ్డిని వేసి తినిపించడం కర్తవ్యం అందుకే ఈ పండుగను " కనుమూపులు" అని పిలిచారు.



  • కనుము రోజు పూజ కార్యక్రమాలు ముగించుకొని, పశువుల అలంకరణకు సిద్ధం అవుతారు
  • పశువులను శుభ్రంగా కడిగి, వాటికీ పసుపు పూసి బొట్లు పెట్టి పూల దందాతో అలంకరిస్తారు మేడలో గంటలు కడతారు.
  • పొంగలి వండి, దేవునికి నైవేద్యం పెట్టిన తరువాత వాటిని పశువులకు తినిపిస్తారు.
  • కనుమరోజు పశువులతో పాటు పక్షులను కూడా పూజించుకునే ఆచారం ఉంది.
  • ఇళ్లలో , దేవాలయంలో వరికంకులు కుచ్చుగా కట్టి పక్షులు తినేందుకు ఆహారంగా పెడతారు.
  • బహిరంగ ప్రదేశాలలో పక్షులు ఎక్కువగా గుమ్ముగూడె చోట గింజలు చల్లి, పక్షులకు ఆహారం తినిపిస్తారు.


అలనాడు గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలితో పైకి ఎత్తి శ్రీకృష్ణ పరమాత్మా నందగోకులాని రక్షించింది కనుమ పండుగ రోజే అనే చెబుతారు. 

కనుమ తరువాత రోజు ముక్కనుమ, రథం ముగ్గుతో పండుగకు ముగింపు పలుకుతారు.
కొన్ని ప్రాంతాలలో కనుమ రోజు రథం ముగ్గు వేస్తారు.

అలాగే ముక్కనుమ రోజు ఆడపిల్లలు బొమ్మల నోము పడతారు.కొత్తగా పెళ్లియినా అమ్మాయిలు సావిత్రిగౌరి వ్రతం చేసుకుంటారు.   

2021 : జనవరి 15.

Post a Comment

0 Comments