Ad Code

Responsive Advertisement

పుష్యమాసంలో ఆదివారం సూర్యాస్తమయానికి ముందే భోజనాలు చేస్తారెందుకు?



పుష్యమాసాన్ని శూన్యమాసం అంటారు. ఈ నెలలో గ్రహసంచారం శుభకార్యాలకు, సుముహూర్తాలకు అనువుగా ఉండదనే కారణంగా అలా అంటారు. ఈ మాసంలో గ్రహానుకూలత కోసం, గ్రహరాజు అయిన సూర్యుని అనుగ్రహం కోసం ఆయనకు ప్రీతిపాత్రమైన ఆదివారం నాడు సూర్యారాధన చేస్తారు. ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యునికి ప్రత్యేక నివేదన చేస్తారు. ఆ ప్రసాదాన్ని సూర్యాస్తమయానికి ముందే భోజనంగా స్వీకరిస్తారు. ఈ సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లోనే కనిపిస్తుంది.

Post a Comment

0 Comments