Ad Code

Responsive Advertisement

పంచారామాలు

దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్ధంలో శ్రీ కుమారస్వామి తారకాసురుడు అనే రాక్షసుని వధించి అతని కంఠంలోని అమృత లింగాన్ని అయిదు భాగాలుగా చేస్తాడు. అవి అయిదు ప్రదేశాలలో పడుతాయి అవే పంచారామాలు.



అమరారామం (అమరావతి) : గుంటూరు నుండి 27 కిలోమీటర్ల , పవిత్ర కృష్ణనది తీరమున వున్నది ఈ ఆలయం. ఈ క్షేత్రంలో శ్రీ అమరేశ్వరస్వామి సమేత రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించవచ్చు.ఇక్కడ స్వామి వారి లింగం రోజు రోజుకు పెరుగిపోతుండంతో శిరస్సున మేకు కొట్టడంతో ఆగిపోయింది.

సోమారామము : ఇక్కడ స్వామి వారు శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి. ఈ క్షేత్రంలో స్వామి లింగమున గోధుమ, నలుపు వర్ణంలో వుంటారు.

క్షీరారామం : ఇక్కడ స్వామి వారు శ్రీ రామలింగేశ్వరస్వామి. స్వామి వెనుక భాగంలో చారలుంటాయి. ఇవి జాడలు అని ప్రతీతి. ఇదే అమృత లింగానికి శిరోభాగం.

ద్రాక్షారామము : ఇక్కడ స్వామి వారు శ్రీ భీమేశ్వరస్వామి. దక్షాప్రజాపతి యజ్ఞాలు చేసిన ప్రదేశం. ఇక్కడ అష్ఠాదశ శక్తిపీఠాలలో ఒకటైన మాణిక్యదేవి కూడా దర్శించవచ్చు.

కుమారారామం : ఇక్కడ స్వామి లింగం ఎత్తు అయినది. ఈ క్షేత్రంలో బాలాత్రిపుర సుందరదేవి కూడా దర్శించవచ్చు.

ద్రాక్షారామం.. రాజమండ్రి నుంచి 44 కి.మీ, కాకినాడ నుంచి 34 కి.మీ దూరంలో ఉంటుంది.

ద్రాక్షారామం నుంచి క్షీరారామానికి (పాలకొల్లు) 73 కి.మీ దూరం. విజయవాడ నుంచి 130 కి.మీల దూరం.

క్షీరారామం నుంచి సోమారామం (గునుపూడి) 23 కి.మీల దూరంలో ఉంటుంది. ద్రాక్షారామం నుంచి 108 కి.మీల దూరం.

సోమారామం నుంచి కుమారారామానికి (సామర్లకోట) దూరం 120 కి.మీ. ద్రాక్షారామం నుంచి 43 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి 50 కి.మీ దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది.

గుంటూరు నుంచి అమరావతికి దూరం 32 కి.మీ. విజయవాడ నుంచి 40 కి.మీ దూరంలో ఉంటుంది.

Post a Comment

0 Comments