Ad Code

Responsive Advertisement

శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు




  • గోదావరి నది ఒడ్దున బ్రహ్మకుండం పవిత్ర స్థలం. అక్కడికి సమీపంలోని పెనుగొండ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మస్థలం.
  • అమ్మవారి జన్మదినం వైశాఖ శుద్ధ దశమి కాగా, ఆమె ఆత్మార్పణ దినం మాఘ శుద్ధ విదియ.
  • మాఘ శుద్ధ విదియ నాడు గోదావరి నది ఒడ్దున నాగేశ్వర స్వామి సన్నిధానానికి సమీపంలో అగ్ని కుండలు మహోజ్వలంగా వెలుగుతున్నాయి.
  • అధికార దర్పానికి చరమగీతం పాడే త్యాగపతాక లాంటి సందర్భం అది.
  • జీవితాంతం కన్యగా వుండాలినుకున్న కన్యకా అభీష్టానికి వ్యతిరేకంగా విష్ణువర్ధనుడు ఆమెను వివాహం చేసుకోవాలి అనుకున్నాడు.
  • ఒప్పుకోకపోవడంతో పెనుగొండ పై యుద్ధం ప్రకటించాడు.తనవల్ల రాజ్యములో సంక్షోభం రేగడం కన్యకను బాధించింది. ఆత్మత్యాగం చేసుకోవాలి అనుకుంది.
  • ఆమెకు మద్దతుగా వైశా ప్రముఖులు కూడా బలిదానానికి సిద్ధపడ్డారు.
  • బలిదానానికి ముందు కన్యకా విశ్వరూపం ప్రదర్శించింది. ఆర్య మహాదేవిగా తనను ప్రకటించుకుంది.
  • గత జన్మలో దేవి ఆరాధన విశేషముగా చేసిన సమాధి అనే వైశా శ్రేష్ఠుడు నేటి జన్మలో కుసుమ శ్రేష్ఠిగా, తన తండ్రిగా జన్మించాడు అని చెపింది.
  • తపోఫలంగా ఆ గోత్రాల వారికీ మోక్షాలు ఇవ్వాలని అయన కోరినందువల్ల ఈ జన్మ వచ్చింది అని తెలియజేసింది.
  • పశ్చిమ గోదావరిజిల్లాల పెనుగొండ గ్రామంలో నిర్మించిన వాసవి ఆలయం ప్రపంచ ప్రసిద్ధి పొందింది.  

Post a Comment

0 Comments