Ad Code

Responsive Advertisement

వరచతుర్థి



మాఘశుద్ధ చవితికి వరచతుర్థి అని పేరు. దీనిని కుంద చతుర్థి, తిల చతుర్థి అని పిలుస్తారు. ఈ చవితి వినాయక పూజకు ఏంతో ప్రముఖమైనది. 

ఈ రోజు పగలు అంత ఉపవాసం ఉంది, ప్రదోష సమయంలో వినాయక స్వామిని పూజించాలి అని కాశీ ఖండం చెబుతుంది. ఈ పూజ వల్ల అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి.

ఈ శుద్ధ చవితి రోజు పగలు అంత ఉపవాసం ఉంది ప్రదోషంలో శివుని మొల్లపూలతో పూజించిన వారికీ సిరిసంపదలు కలుగుతాయి అని కుర్మా పురాణం చెబుతుంది.

అయితే శివధర్మం అనే గ్రంధాన్ని బట్టి మొగలి, మల్లి, మొల్ల, సన్నజాజి, ఉమ్మెత, దిరిసెన, సాల, మంకెన, కానుగ పూలు శివ పూజకు పనికి రావు. కానీ కొన్ని ప్రతేక్య సమయాలలోను, కొన్ని ప్రదేశాలలోను ఈ నిషిద్ధ పుష్పాలతో పూజకు శుభ ఫలితాలు చెప్పబడినాయి.అలాంటి వాటిలో మొల్ల ఒక్కటి. శివపూజకు మొల్లపూలు నిషేధమైనప్పటికీ ఈ కుంద చతుర్థి నాడు మాత్రం మొల్లపూలతో శివుని పూజిస్తే సిరి సంపదలు లభిస్తాయి అని శాస్త్ర గ్రంధాలు చెబుతున్నాయి.

2019 : 8 ఫిబ్రవరి.

Post a Comment

0 Comments