Ad Code

Responsive Advertisement

శ్రీ పళ్ళికొండేశ్వర స్వామి వారి ఆలయం- సురుతపల్లి.



శ్రీ పళ్ళికొండేశ్వర స్వామి వారి ఆలయం చిత్తూరు జిల్లా సురుతపల్లిలో ఉంది. ఇక్కడ శివుడు మనకు అమ్మవారిమీద పండుకొని దర్శనమిస్తాడు. ఇక్కడ స్వామి వారి శయన భంగిమలో ఉంటాడు కనుక పళ్ళికొండేశ్వర స్వామి అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు మరకతాంబిక.

స్థలపురాణం ప్రకారం దేవతలకు, అసురలకు ,మధ్య జరిగిన క్షీరసాగర మధన సమయంలో కాలకూట విషం సేవించిన శివుడు అమ్మవారి మీద విశ్రాంతి తీసుకున్నాడు అని చెబుతారు. 

ఈ ఆలయాన్ని విజయనగర రాజులైన హరిహర మరియు బుక్క రాయులు కాలంలో నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది.

ఈ ఆలయం ప్రదోష పూజలకు ప్రసిద్ధి చెందింది. 
ఇక్కడ వివిధ దేవతలు మనకు దర్శనమిస్తారు.
దక్షిణామూర్తి స్వామి వారు ఇక్కడ అమ్మవారితో కలిసి దర్శినమివ్వడం ఈ ఆలయంలో మరో విశేషం. 

భారతదేశంలోనే శివునికి రూపకారము ఉన్నది ఈ దేవాలయంలో మాత్రమే. ఈ ఆలయంలో దాంపత్య దక్షిణామూర్తికి అభిషేకం చేస్తే భార్యాభర్తలు కలహములు పోయి సుఖంగా జీవిస్తారు. పెళ్లికాని వారు స్వామిని దర్శిస్తే తొందరగా పెళ్లి అవుతుంది. అనారోగ్యులు ఆరోగ్యవంతులు అవుతారు. 

ముఖ్యమైన పండుగలు :

మహాశివరాత్రి
ప్రదోష కాల పూజలు
కార్తీక పౌర్ణమి 

ఆలయం వేళలు :

ఉదయం 05.30  నుండి మధ్యాహ్నం 01.00 వరకు 

సాయంత్రం 03.00 నుండి రాత్రి 08.30  వరకు 

ఎలా వెళాళ్లి :

నాగలాపురం నుండి  11 కి.మీ  దూరంలో ఉంది. 

తిరుపతి నుండి 74 కి.మీ  దూరంలో ఉంది. 

చెన్నై నుండి 60  కి.మీ  దూరంలో ఉంది. 

చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :

శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయం నాగలాపురం - 11 కి.మీ 
రామగిరి  - 20 కి.మీ 
శ్రీనివాసమంగాపురం  - 50 కి.మీ 
శ్రీకాళహస్తి  - 60 కి.మీ 

Post a Comment

0 Comments