Ad Code

Responsive Advertisement

శబరిమలలో ఆలయం ఎప్పుడు తెరిచి ఉంటుంది ?



  • శబరిమల ఆలయం ఎక్కువ రోజులు తెరిచివుంచే సమయం - మండల పూజ సమయం. 
  •  41 రోజుల కాలాన్ని మండలం అని అంటారు.
  • మండల పూజ కోసం కేరళ మాసమైన వృశ్చిక మాసం మొదటి రోజు (ఇంచు మించు నవంబర్ 16, 17 లో ) తెరుస్తారు. అప్పటి నుండి డిసెంబర్ 27 వరకు శబరిమల క్షేత్రంలో మండల పూజలు జరుగుతాయి.
  • మళ్ళీ డిసెంబర్ 30 న తెరుస్తారు (డిసెంబర్ 28,29,30  తేదీలలో అయ్యప్ప దర్శనం లభించదు).
  • మకర విళక్కు ఉత్సవం కోసం ఆలయం జనవరి 20 వ తేదీ వరకు తెరిచి ఉంటుంది.
  • అంటే సంవత్సరంలో అత్యధిక రోజులు శబరిమల తెరిచివుండే కాలం ఇదే. ఇవి కాకుండా మలయాళ పంచాంగం ప్రకారం ప్రతి నెల మసపూజల కోసం మాస ప్రారంభంలో ఐదు రోజుల పాటు తెరిచి ఉంచుతారు.
  • ఇవి కాకుండా విషు పర్వదినం సందర్భంగా ఏప్రిల్ నెలలో ఎనిమిది రోజులు, స్వామి వారి ప్రతిష్ట దినోత్సవం సందర్భంగా జూన్ నెలలో రెండు రోజులు, ఓనం పరవా దినం సందర్భంగా అక్టోబర్ నెలలో ఆరు రోజులు ఆలయం తెరిచి ఉంచుతారు. 


Post a Comment

0 Comments