Ad Code

Responsive Advertisement

గ్రహణ సమయంలో ఆలయాలు ఎందుకు మూసివేస్తారు ? || Why temples will be closed on Surya grahan

గ్రహణ సమయాల్లో దేవాలయాలను మూసివేస్తారు. గ్రహణం తొలగిన అనంతరమే శుద్ధిచేసి దర్శనాలకు అనుమతిస్తారు. అస‌లు గ్ర‌హ‌ణ స‌మ‌యంలో దేవాల‌యాల‌ను ఎందుకు మాస్తారంటే.. భూమికి నిత్యం వెలుగులను పంచే సూర్య, చంద్రులను రాహు కేతువు మింగివేయడాన్ని అశుభంగా పరిగణిస్తారు.



రాహు కేతువులు చెడు గ్రహాలు కావడంతో వాటి నుంచి వచ్చే విష కిరణాలు ఆలయాలపై వ్యతిరేక ప్రభావం చూపిస్తాయి. అందుకనే ఆలయాలను మూసివేస్తారు. దేశంలోని ఆలయాలన్నీ గ్రహణం రోజున మూతపడ‌తాయి. కానీ  శ్రీకాళహస్తీశ్వరాలయం మాత్రం తెరిచే ఉంటుంది. ముక్కంటికి గ్రహణకాలంలోనే గ్రహణ కాలాభిషేకాలు నిర్వహిస్తారు. ఇక్కడ ప్రధాన శివలింగంపై ఉన్న కవచంలో 27 నక్షత్రాలు, తొమ్మిది రాశులు ఉంటాయి. యావత్‌ సౌర కుటుంబాన్ని ఈ కవచం నియంత్రిస్తుంటుంది.

కవచంలో అన్ని గ్రహాలు ఉండటంతో వాటిపై ఆలయకారకుడు ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడు. అందుకనే గ్రహణ ప్రభావం ఈ ఆలయంపై పడదు. అలాగే రాహుకేతు దోషాలను నివారించే దివ్యశైవక్షేత్రం కాళహస్తి కాబట్టి, సూర్య, చంద్రగ్రహణ దోషాలు ముక్కంటిని ఏమాత్రం ప్రభావం చూపించవు.

Post a Comment

0 Comments