Ad Code

Responsive Advertisement

శ్రీ ధర్మశాస్త ఆలయం - అచ్చన్ కోవిల్


అయ్యప్ప స్వామి ప్రముఖమైన ఆలయాలలో అచ్చన్ కోవిల్ ఆలయం ఒక్కటి. ఈ ఆలయం కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లా పఠనాపురం వద్ద వుంది.  ఇక్కడ అయ్యప్ప స్వామి గృహస్థ జీవితం గడిపినట్లు తెలుస్తుంది. ఇక్కడ స్వామి వారికీ పూర్ణ, పుష్కల అనే భార్యలు ఉన్నట్లు చెబుతారు.

ఈ ఆలయంలో అయ్యప్ప స్వామివారిని పరశురాముడు ప్రతిష్టించినట్లు తెలుస్తుంది. పాము కాటుకు గురి అయిన వారికీ ఇక్కడ ఉపశమనం లభిస్తుంది. ఇక్కడ చందనం, మరియు తీర్థానికి ఆ శక్తి ఉన్నట్లు చెబుతారు.

శబరిమలకి వెళ్లే భక్తులు ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో పూర్ణ, పుష్కల అమ్మవార్ల విగ్రహాలు కూడా ఉన్నాయి.

ముఖ్యమైన పండుగలు :

మండల పూజ
రథోత్సవం
రేవతి పూజ
ధనుర్మాసం

ఆలయాల వేళలు :

ఉదయం 5.00  నుండి రాత్రి 7.00 గంటల వరకు

ఎలా వెళ్ళాలి :

తిరువనంతపురం నుండి 111 కి.మీ దూరంలో 
టెంకాసి నుండి 29 కి.మీ దూరంలో
శెంకోట్టై రైల్వే స్టేషన్ నుండి 25 కి.మీ దూరంలో

చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :

వర్కాల శివగిరి మట్టం - 92 కి.మీ దూరంలో 
హరిపడి సుబ్రమణ్య స్వామి ఆలయం - 93 కి.మీ దూరంలో 
మన్నరసాల శ్రీ నాగరాజా స్వామి ఆలయం - 93 కి.మీ దూరంలో 

Post a Comment

0 Comments