Ad Code

Responsive Advertisement

శ్రీ కొలను భారతి అమ్మవారి వారి ఆలయం - శివపురం (కర్నూలు జిల్లా)

శ్రీకొలనుభారతీ దేవి(సరస్వతి) కర్నూలు జిల్లాలోని కొత్తపల్లె మండలం, శివపురం గ్రామంలో వెలసివున్నది. ఈ ఆలయం 11వ శతాబ్దములో నిర్మించినట్లు తెలుస్తుంది. ఇక్కడ అమ్మవారు శ్రీచక్ర సమేతముగా మహా సరస్వతి రూపంలో వెలసివున్నారు. ఇక్కడ సప్త శివాలయాలు ఉన్నాయి. వీటిని సప్తరుషులు ఒక్కొక్క రుషి ఒక్కొక్క దేవాలయమును ప్రతిష్ఠ చేసినట్లు చెబుతారు.

ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. ఇక్కడ  శ్రీదేవి భూదేవి సమేత జనార్ధనస్వామి ఆలయం ఉంది.ఈ ఆలయంలో  కొలనులోని ఎంత నీరు వెచ్చించినా అమ్మవారి సరిహద్దు వరకే పారి భూమిలోకి ఇంకిపోతుంది. ఈ కొలనును చారుఘోషిణి అని అంతర్వాహిని అని కూడా పిలుస్తారు. 

అమ్మవారి సన్నిధానములో చిన్నారులకు అక్షరాభ్యాసములు, బీజాక్షరములు చేయిస్తే మంచి విద్యాబుద్ధులు వస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసము.

ముఖ్యమైన పండుగలు :

వసంత పంచమి
ఉగాది
దసరా 
సంక్రాంతి
శివరాత్రి 
కార్తీక మాసం
ముక్కోటి ఏకాదశి

ఆలయాల వేళలు :

ఉదయం 6.00 నుండి సాయంత్రం 6.00  గంటల వరకు

ఎలా వెళ్ళాలి :

కర్నూలు నుండి 88 కిమీ దూరంలో
ఆత్మకూరు నుండి 20 కిమీ దూరంలో
నందికొట్కూరు నుండి 58  కిమీ దూరంలో

చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :

కాకనూరు శ్రీ సరస్వతి జ్ఞాన పీఠం - 57 కిమీ దూరంలో
ఓంకారం సిద్దేశ్వర స్వామి ఆలయం - 68 కిమీ దూరంలో
మహానంది ఆలయం - 83 కిమీ దూరంలో 

Post a Comment

0 Comments