Ad Code

Responsive Advertisement

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం - వడపల్లి


ఈ ఆలయం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఈ ఆలయాన్ని కోనసీమ తిరుపతి అని పిలుస్తారు. ఈ ఆలయం పక్కనే గౌతమీ నది ప్రవహిస్తుంది. ఈ ఆలయంలో స్వామివారి మూలవిరాట్టును ఎర్ర చందనంతో తయారు చేసారు. 

పురాణాల ప్రకారం చాల మంది మునులు, సనక సనందనాది ఋషులు వైకుంఠంలో ఉన్న విష్ణువు ప్రార్ధించి కలియుగంలో ధర్మం నిలబెట్టమని వేడుకున్నారు. అప్పుడు స్వామివారు వారికీ గౌతమీనదిలో చందనపు పెట్టాలో వెలస్తాను అని అభయమిచ్చారు.

ఈ ఆలయంలో పూజలు వైఖానస ఆగమాలు ప్రకారం జరుగుతాయి.

ముఖ్యమైన పండుగలు :

గోదావరి పుష్కరాలు
కల్యాణోత్సవం (చైత్ర శుద్ధ ఏకాదశి)
తెప్పోత్సవం
రథోత్సవం
వైకుంఠ ఏకాదశి

ఆలయ వేళలు :

ఉదయం 6  నుండి రాత్రి 8 .30 వరకు

ఎలా వెళ్ళాలి :

ఏలూరు నుండి 109 కి.మీ దూరం
రాజమండ్రి  నుండి 31 కి.మీ దూరం
తణుకు నుండి 39 కి.మీ దూరం

చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :

పాలకొల్లు క్షీర రామలింగేశ్వర  ఆలయం - 46 కి.మీ దూరం
ఆచంట రామలింగేశ్వర  ఆలయం - 31 కి.మీ దూరం
అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ ఆలయం - 47  కి.మీ దూరం 

Post a Comment

0 Comments