Ad Code

Responsive Advertisement

శ్రీ సిద్దేశ్వర స్వామి వారి ఆలయం - ఓంకారం

ఈ ఆలయం కర్నూలు జిల్లా, బండి ఆత్మకూరు మండలం నల్లమల అడవులకి దగరలో ఉంది. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పురాతన ఆలయాలలో ఒక్కటి. 

పురాణాల ప్రకారం చాలామంది మునులు, సప్తఋషులు ఇక్కడ తపస్సు చేసారు. వ్యాస మహర్షి ఈ ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్టించాడు. శ్రీ రాముడు మరియు పంచపాండవులు ఈ ఆలయాన్ని దర్శించారు.

ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది.ప్రతి సోమవారం పంచామృత అభిషేకం జరుగుతుంది. 

ఓంకారంలో వెంకటేశ్వర స్వామి, దుర్గాదేవి ఆలయాలు కూడా ఉన్నాయి.


ముఖ్యమైన పండుగలు :

మహాశివరాత్రి
వినాయక చవితి
కార్తీకపౌర్ణమి
దసరా 

ఆలయ వేళలు :

ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 వరకు
సాయంత్రం 3 నుండి రాత్రి 8 వరకు.

ఎలా వెళ్ళాలి :

కర్నూలు  నుండి 86 కి.మీ దూరంలో
నంద్యాల నుండి 24  కి.మీ దూరంలో
ఆళ్లగడ్డ  నుండి 65  కి.మీ దూరంలో

చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :

నంద్యాల శ్రీ జగజ్జనని అమ్మవారి ఆలయం - 25  కి.మీ దూరంలో
గోస్పాడు శ్రీ పెద్దమ్మ తల్లి  ఆలయం - 39  కి.మీ దూరంలో
గాజులపల్లి సర్వ లక్ష్మీనరసింహ  ఆలయం - 40  కి.మీ దూరంలో. 

Post a Comment

0 Comments