Ad Code

Responsive Advertisement

బాసర జ్ఞాన సరస్వతి ఆలయం



ఆదిలాబాదు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రఖ్యాతిచెందిన ఆలయం జ్ఞానసరస్వతి ఆలయం. ఇది ఆదిలాబాదు జిల్లా ముధోల్ మండలం బాసరలో ఉంది.బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు. ఇక్కడి మందిరం చాళుక్యులకాలంలో నిర్మింపబడింది.

బాసర సరస్వతీ ఆలయం దేశంలోని ప్రఖ్యాత సరస్వతీ ఆలయాలలో ఒకటి. ఇక్కడ సరస్వతీ ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు.

బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం చెబుతోంది. కురుక్షేత్ర యుద్ధానంతరం వేదవ్యాసుడు మనశ్శాంతి కోరి తన కుమారుడైన శుకునితో దండకారణ్యానికి వచ్చి ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై ఇక్కడ కుటీరం నిర్మించి తపస్సు చేయడం ప్రారంభించాడు. వేదవ్యాస మహర్షికి జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. వ్యాసుడు నదిలోంచి మూడు గుప్పెళ్ళు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతలమూర్తులు ప్రతిష్ఠించాడు. వ్యాసుడు ఇక్కడ కొంత కాలము నివసించాడు కనుక అప్పటినుండి ఈ ఊరు వ్యాసపురి, వ్యాసర అనబడి, తరువాత ఇక్కడ ఉన్న మహారాష్ట్ర ప్రజల ప్రభావం వలన 'బాసర' గా నామాంతరాన్ని సంతరించుకున్నది.

ముఖ్యమైన పండుగలు :

వసంత పంచమి
వ్యాస పౌర్ణమి
మహాశివరాత్రి
దసరా నవరాత్రులు 

ఆలయ వేళలు :

ఉదయం 4 నుండి మధ్యాహ్నం 12 .30 వరకు
మధ్యాహ్నం 2 నుండి రాత్రి 8 .30 వరకు

ఎలా వెళ్ళాలి :

నిజామాబాద్ నుండి 34 కి.మీ దూరంలో ఉంది.

చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :

వనదుర్గ రేణుక ఎల్లమ్మ ఆలయం - 25 కి.మీ దూరంలో 
జనకంపేట లక్ష్మి నరసింహ ఆలయం - 27 కి.మీ దూరంలో 
హింగులాంబ దేవి ఆలయం నిజామాబాద్ - 32 కి.మీ దూరంలో 

Post a Comment

0 Comments