Ad Code

Responsive Advertisement

రథసప్తమి రోజు ఏమి చేయాలి ?


  • ప్రత్యక్ష భగవానుడైన సూర్యుని ఆరాధించే పర్వదినం రథసప్తమి.
  • ఈ రోజు ప్రధాన విధులలో మాఘస్నానం ముఖ్యమైనది.
  • ఈ మాఘస్నానాన్ని విధివిధానంగా ఆచరించడం వల్ల సకలరోగాలు నివారింపబడుతాయి అని, ఏడు జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయి అని చెప్పబడుతోంది.
  • ఈ స్నానాన్ని నదిలో కాని, పుణ్యతీర్థంలో కాని చేయడం ఉత్తమం.
  • స్నానం చేయడానికి ముందు ఆకులను దొన్నెలుగా చేసి అందులో దీపాన్ని వెలిగించి, సూర్యుని ధ్యానిస్తూ ఆ దీపాన్ని నీటిలో వదిలి స్నానం చేయాలి.
  • ఈ రోజు స్నానంలో ఏడు తెల్లజిల్లేడు ఆకులనుంచుకుని స్నానం చేయడం వలన ఆరోగ్యం చేకూరుతుంది అని చెబుతారు.
  • తరువాత సూర్యభగవానుడిని విధివిధానంగా పూజించాలి. 

Post a Comment

0 Comments