Ad Code

Responsive Advertisement

భోగి పండుగ




తెలుగు వారి పండుగల లో ముఖ్యమైన పండుగ పెద్ద పండుగ సంక్రాంతి . కొని చోట్ల  మూడు రోజులు కొని చోట్ల నాలుగు రోజులు పండుగ చేస్తారు .దీని లో మొదటి రోజు భోగి పండుగ.


భోగి పండుగ :

భోగి పండుగ అనగా ముందుగా గుర్తు వచ్చేది భోగి మంటలు. భోగి అంటే భోగభాగ్యాలు అందించే పండుగ, మన భారత దేశం వ్యవసాయ ఆధారిత దేశం. సరిగా పంటలు మన చేతికి వచ్చే సమయం కాబట్టి రైతులుతో పాటు  అందరు ఆనందంగా జరుపుకునే పండుగ.అందరి ఇళ్లల్లో ఆనందం తెచ్చే పండుగ.

పూర్వం విష్ణు చిత్తుడు అనే విష్ణు భక్తుడు శ్రీ విల్లి పుత్తూరులో వుండే వాడు. అతడు ఒక రోజు తులసితోటలో గోదాదేవి అనే ఒక అమ్మాయిని చూసి తన కూతురుగా భావించాడు. ఆ అమ్మాయి పెరిగి పెళ్లి చేసి సమయానికి ఆమె విష్ణుని తప్ప మరో ఒక్కరిని పెళ్లి చేసుకోను అని పట్టు పట్టింది. ముపై రోజులు ధనుర్మాస వ్రతం ఆచరించి తిరుప్పావైని పట్టిస్తుండేది. ఒక రోజు విష్ణు ఆమె ముందు కనపడి శ్రీరంగం రమ్మన్నాడు . విష్ణు చిత్తుడు ఆమెను శ్రీ రంగం తీసుకువెళ్లి శ్రీ రంగనాథ స్వామికి ఇచ్చి వివాహం చేస్తాడు. దీనికి ప్రతీకగా భోగి పండుగ రోజు గోదా కళ్యాణం నిర్వహిస్తారు .

వేకువజామున లేచి భోగి మంటలు వేస్తారు. ఇంట్లో వున్నా చెత్త అంట భోగి మంటలలో తగలబెడుతారు. తల స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటారుఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసి గొబ్బిళ్ళు  పెడుతారు. ఇంట్లో చిన్న పిల్లలకు భోగి పండ్లు పోస్తారు .ఆలా పోస్తే  పిల్లలకు ఎలాంటి  కీడు జరగదు అని భావిస్తారు 

ఇల్లు మొత్తం శుభ్రం చేస్తారు.ఇంట్లో మామిడి తోరణాలు కడతారు.పల్లెలు లో అయితే సందడి ఇంకా వేరుగా ఉంటుంది, కోడి పందాలు , హరిదాసులు , ఇంకా అడవాళ్ళ గొబెమ్మల పాటలు సందడి సందడి గా చేస్తారు.

2021 : జనవరి 13. 

Post a Comment

0 Comments