Ad Code

Responsive Advertisement

2020 : శ్రీకూర్మం దేవస్థానంలో అష్టతీర్థ మహాయోగం.


శ్రీ కూర్మ క్షేత్రంలో ఫిబ్రవరి 2 నుండి 9 వరకు ఏర్పడే అష్టతీర్థ మహాయోగంలో పుణ్యస్నానం ఆచరిస్తే కోటి చంద్రగ్రహణ ఫలితం లభిస్తుంది అని క్షేత్ర మహత్యం తెలుపుతోంది. 24 ఏళ్ళ తరువాత ఇది ఏర్పడనుంది.

శ్రీ మహావిష్ణు దశవతారలలో రెండవ అవతారమైన శ్రీకూర్మ అవతారం వెలసిన దివ్య క్షేత్రం ఇది.

అష్ట తీర్థాలు :

నారదగుండం : బస్టాండు నుండి కిలోమీటర్ దూరంలో వుంది

నరసింహ తీర్థం : శ్రీకూర్మ క్షేత్రం నుండి 2 కిలోమీటర్ల దూరంలో వుంది 

చక్రతీర్థం :  శ్రీకూర్మ క్షేత్రం నుండి 2 కిలోమీటర్ల దూరంలో వుంది. ఇక్కడ అభయ వరద ఆంజనేయ స్వామి వారి ఆలయం వుంది.

సుధాగుండం(శ్వేత పుష్కరిణి) : ఆలయానికి ఎదురుగా వుండే శ్వేతపుష్కరిణిని సుధాగుండం అని అంటారు. ఈ పుష్కరిణిలో పితృదేవతలకు ప్రీతిగా పిండ నిక్లిప్తం చేస్తే వారికీ ముక్తి లభిస్తుంది అని స్థల పురాణం చెబుతోంది.

మాధవ గుండం : బస్టాండ్ నుండి అరకిలోమీటరు దూరంలో వుంది.

కౌటిల్య తీర్థం : శ్రీకూర్మం నుండి 2 కిలోమీటర్ల దూరంలో వుంది 

వక్రతీర్థం : శ్రీకూర్మం నుండి 4 కిలోమీటర్ల దూరంలో వుంది 

మహోదధి (సముద్రం) : శ్రీకూర్మం నుండి 3 కిలోమీటర్ల దూరంలో వుంది.ఇక్కడ భక్తులు పవిత్ర సముద్ర స్నానాలు ఆచరించవచ్చు. 

Post a Comment

0 Comments