Ad Code

Responsive Advertisement

శ్రీనివాస మంగాపురం ఆలయంలో జరిగే ఉత్సవాలు


  • నిత్యోత్సవాలలో సుప్రభాతం, తోమాల సేవ , సహస్రనామార్చన, నిత్యకల్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం జరుగుతాయి.
  • ఆర్జిత బ్రహ్మోత్సవంలో అశ్వవాహనం, హనుమంత వాహనం,గరుడసేవ మాత్రమే జరుగుతాయి ఏకాంతసేవ జరుగుతుంది.
  • వారోత్సవాలలో స్వర్ణ ఫుష్ప అర్చన, శతకలశాభిషేకం, తిరుప్పావడసేవ, నేత్రదర్శనం, పూలంగి సేవ, అభిషేకం వస్త్రాలంకరణ సేవ, గ్రామోత్సవాలు మాత్రమే జరుగుతాయి. 
  • మాసోత్సవాలలో శ్రావణ నక్షత్రం నాడు ఉంజల్ సేవ జరుగుతుంది.
  • వార్షికోత్సవాలలో ఉగాది ఆస్థానం, శ్రీరామనవమి, ధనుర్మాసంపూజ, మాఘమాసంలో అనగా సౌరమానం ప్రకారం కుంభమాసంలో శ్రావణ నక్షత్రానికి పూర్తి అయ్యాటట్లు 9 రోజుల ముందు నుండి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
  • పాల్గుణమాసంలో శ్రవణ నక్షత్రం రోజు ఫుష్ప యాగం జరుగుతుంది.
  • వైశాఖమాసంలో శ్రావణ నక్షత్రానికి పూర్తి అవడానికి మూడురోజుల పాటు వసంతోత్సవాలు జరుగుతాయి.
  • ఆషాడ శుద్ధ సప్తమి లేదా ఉత్తరఫల్గుణి నాటికీ 3 రోజుల పాటు సాక్షాత్కార వైభోత్సవాలు జరుగుతాయి .
  • జులై 16 లేదా 17 న ఆణివార ఆస్థానం జరుగుతుంది.
  • ఆశ్వయుజమాసంలో బహుళద్వాదశికి మూడు రోజుల ముందు పవిత్రోత్సవాలు జరుగుతాయి.  

Post a Comment

0 Comments