Ad Code

Responsive Advertisement

వటసావిత్రి వ్రత కథ

పూర్వం అశ్వపతి, మాళవి దంపతులకు ‘సావిత్రి’ అనే కుమార్తె వుండేది. యుక్తవయస్కురాలెైన సావిత్రికి నీకు ఇష్టమైనవాడిని వరించమని తల్లిదండ్రులు అనుమతినిచ్చారు. రాజ్యం శత్రువులపాలు కావడంతో అరణ్యంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని జీవిస్తోన్న ద్యుమత్సేనుడి కుమారుడెైన సత్య వంతుని వివాహమాడతానని తల్లిదండ్రులకు తెలిపింది. సత్య వంతుడి ఆయుష్షు మరో సంవత్సరమేనని నారదుడు చెప్పినప్ప టికీ, సావిత్రి పట్టుపట్టడంతో సత్యవంతుడితోనే వివాహం చేశా రు. మెట్టినింట చేరి భర్త, అత్తమామలకు సేవ చేయసాగింది. సత్యవంతుడు ఒకనాడు యజ్ఞ సమిధలు, పుష్పాలకోసం అడ వికి బయలుదేరగా, సావిత్రీ భర్తను అనుసరించింది. సమిధుల ను కోసి చెట్టు దిగిన సత్యవంతుడు తలభారంతో సావిత్రి ఒడి లో తలపెట్టుకుని పడుకున్నాడు. నారదుడు చెప్పిన సమయం ఆసన్నమైనదని సావిత్రి గుర్తించింది. కొద్దిసేపటికి యముడు తన దూతలతో వచ్చి సత్యవంతుడికి యమపాశం వేసి తీసుకుని పోసాగాడు. సావిత్రి కూడ తన భర్తను అనుసరించి వెళ్ళసాగింది. యముడు వారించినప్పటికీ భర్త వెంటే తనకూ మార్గమని చెప్పి వెళ్తూండడంతో ఆమె పతి భక్తిని మెచ్చిన యముడు సావిత్రిని వరం కోరుకోమన్నాడు.

‘మామగారికి దృష్టి ప్రసాదించండి’ అని ఓ వరాన్ని కోరింది, యముడు ప్రసాదించాడు. అయినా సావిత్రి వెంట వస్తుండడంతో, యముడు మరో వరాన్ని కోరుకోమన్నా డు. మామగారు పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి ప్రసా దించమని కోరింది, యముడు ప్రసాదించాడు. అయినా సావిత్రి వెంట వస్తూండడంతో, ఆమె పతిభక్తిని మెచ్చి మూడో వరం కోరుకోమనగా - ‘నేను పుత్రులకు తల్లిని అయ్యేట్లు వరాన్ని ప్రసాదించండి’ అని కోరింది. యముడు సావిత్రి పతిభక్తిని మెచ్చి ఆ వరాన్ని ప్రసాదించాడు. సావిత్రి అడవిలో వటవృక్షం కింద ఉన్న భర్త శరీరం వద్దకు చేరింది. భర్త లేచి కూర్చోగా, వటవృక్షం వరకు పూజ చేసి భర్తతో సహా రాజ్యానికి చేరినట్లు కథ నం. వటవృక్షాన్ని, సావిత్రిని పూజిస్తూ చేసి ‘వట సావిత్రి వ్రతం’ అమల్లోకి వచ్చినట్లు పురాణ కథనం.

Post a Comment

0 Comments