Ad Code

Responsive Advertisement

ఓనం


  • కేరళీయులకు ఓనం పెద్ద పండుగ. 
  • ఇది సౌరమానం ప్రకారం శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం వచ్చే రోజున ఆచరించడం ఆచారం.
  • శ్రవణ నక్షత్రానికి పది రోజుల ముందుగా హస్తా నక్షత్రం నుంచే పండుగ ఆచరణ ఆరంభమవుతుంది, శతభిషతో  సమాప్తమవుతుంది. 
  • కేరళలో వైశాఖంలో ఆరంభమయిన వాన శ్రావణమాసంలో ఆగుతుంది.
  • కొన్ని పంటలు కోతకు వస్తాయి. ముఖ్యంగా కొబ్బరి చెట్లు కాపు కాలం. 
  • ఇంత  వానలు కురిపించి తమకు పంటలు పండించినందుకు ఇంద్రునికి, జనం సంతోషంతో పూజలు జరుపుతారు.
  • హస్తా నక్షత్రం నాడు పిల్లలు ఊరివెలుపలికి పోయి రకరకాల రంగురంగుల పూలు తెచ్చి, పేడతో ఇంటిముంగిలి అలికి, పూలను గుండ్రంగా పేర్చుతారు.
  • ఇలా ఉత్తరాషాఢ వరకు తొమ్మిదినాళ్లు తొమ్మిది పూలవర్తులాలు చేస్తారు.
  • శ్రావణ నక్షత్రం నాడు పూవుల గుండ్రంలో మహాదేవుని పూజిస్తారు.
  • మహాదేవుడంటే కేరళలోని తిరుక్కాల్ కరై అనే క్షేత్రంలోని విష్ణువు.
  • పూవులతో పూజించిన తరువాత ఒక ఆకులో అరై నే బియ్యపు అట్టు, కొబ్బరికోరు నైవేద్యం పెట్టి నమస్కరిస్తారు.
  • సాయంకాలం స్త్రీలు, పురుషులు రకరకాల ఆటలు ఆడుతారు కైక్కొట్టి కళి అనేది ఆడవారు ఆడే ముఖ్యమైన ఆట. 
  • పురుషులు కూడా బలప్రదర్శన చేయడం, కిలియన్ తట్టు, తలమైప్పందు వంటి రకరకాల ఆటలు ఆడుతారు.


వామనావతారంలో బలిచక్రవర్తిని శ్రీమహావిష్ణువు పాతాళానికి తొక్కేశాడు. ఏడాదికి ఓసారి ఓణం సమయంలో తన ప్రజలను చూసేందుకు భూమిపైకి రావచ్చని బలి చక్రవర్తి అనుమతినిచ్చాడు. ఈ సమయంలో ఆ మహాదాత బలి తమ సంతోషంలో పాలుపంచుకుంటాడని కేరళీయులు విశ్వసిస్తారు.

2022 తేదీ: సెప్టెంబర్ 08.

Post a Comment

0 Comments