Ad Code

Responsive Advertisement

వామన జయంతి




  • శ్రీమహావిష్ణువు దశావతారాలలో అయిదోది వామన అవతారం.
  • అంతకు ముందు వచ్చిన మత్స్య,కుర్మా, వరాహ, నరసింహ అవతారాలు జంతుసంబంధమైనవి కాగా, వామన అవతారంలో శ్రీహరి బాలవటువుగా వచ్చాడు.
  • అదితి కశ్యపుల కడుపున విష్ణువు వామనావతారం ధరించి వచ్చిన రోజే భాద్రపద శుక్ల ద్వాదశి. 
  • వామన జయంతి నాడు పూజామందిరాలలో వామనుడి చిత్రపటాన్ని ప్రతిష్టించి పూజించాలి.
  • లేదా పసుపుతో వామనుడిని తయారుచేసుకుని షోడశోపచారాలతో, అష్టోత్తరాలతో పూజించాలి.
  • పగటిపూట ఉపవాసం ఉంది, రాత్రి పూజ తరువాత భుజించాలి.
  • ఈ రోజు పెరుగు దానం చేయడం మంచిది.
  • వామన జయంతి విధులు పాటించడం వల్ల బ్రహ్మహత్యాది దోషాలు తొలగిపోతాయి. 

వామన ఆలయాలు 

గుంటూరు జిల్లా చెరుకూరు లో ఆలయం ఉంది.

కేరళ రాష్ట్రం త్రిసూర్ జిల్లాలోని చేర్పు, ఎర్నాకులం జిల్లాలోని తిరుకాకర.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖజురహో.

తమిళనాడు, విల్లుపురం జిల్లాలోని తిరుకోయిలూరు, కంచి వరదరాజ ఆలయంలోని ఉలగలనాథ ఆలయం.

2022 తేదీ : సెప్టెంబర్ 07.

Post a Comment

0 Comments